Go to full page →

ఒకే రకమైన బ్రేక్ ఫాస్ట్ CDTel 267

ఉత్తరం 19c, 1892 CDTel 267.8

391. నా పనిలో ఏ సేవ కన్నా ఎక్కువ జీతం వంటమనిషికిస్తాను.... ఆ వ్యక్తి అయోగ్యురాలు, వంటలో నిపుణతలేని స్త్రీ అయితే — మా అనుభవంలో మేం తెలుసుకున్నట్లు — ఒకే రకమైన బ్రేక్ ఫాస్ట్ ఉంటుందని - జావ, బ్రెడ్డు, ఒక రకం సాస్, కొంచెం పాలు, అంతే - అని మీరూ తెలుసుకుంటారు. కొన్ని నెలలు ఈ రకంగా తిన్నవారు, ప్రతీపూట భోజనానికి తమ ముందు ఏముంటుందో ఎరిగి, ఆనందంగా ఎదురుచూడాల్సిన భోజన సమయాన్ని దినంలో భయంకర సమయంగా పరిగణిస్తారు. అనుభవమయ్యే వరకు ఇదంతా మీకు అవగాహన కాకపోవచ్చు. కాని ఈ విషయమై నేను చాలా ఆందోళన చెందుతున్నాను. ఈ స్థలానికి రావటానికి సిద్ధపడటంలో నాకు మళ్లీ అవకాశం దొరికితే, ఆరోగ్యవంతమైన ఆహారాన్ని సామాన్యంగా, ఆకలి పుట్టించే రీతిగా వంటచెయ్యగల, కొత్త అభిప్రాయాలు గల, వంటగత్తెని ఇవ్వమని అడుగుతాను. CDTel 267.9