Go to full page →

చదివి ఆచరణలో పెట్టండి CDTel 268

(1868) 1 T 681-685 CDTel 268.1

392. ఇది (వంట) ఓ విధి అని అనేకులు భావించరు. కనుక వారు ఆహారాన్ని సరిగా తయారుచెయ్యటానికి ప్రయత్నించరు. పందికొవ్వు బటర్ లేక మాంసం ఉపయోగించ కుండా ఆహారాన్ని సామాన్యంగా, ఆరోగ్యదాయకంగా సులువుగా తయారుచెయ్యవచ్చు. సామాన్యతతో నిపుణత మిలితమవ్వాలి. ఇది జరగాలంటే స్త్రీలు చదవాలి, చదివిన విషయాన్ని ఆచరణలో పెట్టాలి. అనేకమంది ఇది చెయ్యటానికి కష్టపడరు గనుక బాధపడుతున్నారు. అలాంటి వారితో - నిద్రపోతున్న మీ శక్తుల్ని మేల్కొలిపి, చదవండి అంటాను. సామాన్యంగా వండటం అయినా రుచిగా ఆరోగ్యకరంగా వండటం నేర్చుకోండి. CDTel 268.2

కేవలం రుచిని తృప్తి పర్చటానికి వండటం లేక ఆకలికి తగినట్టుగా వండటం సరికాదు కాబట్టి పోషకాలు లేని నిస్సారమైన ఆహారం మంచిదని ఎవరూ తలంచకూడదు. అనేకులు వ్యాధి వల్ల శక్తిహీనులవుతున్నారు. వారికి పోషణనిచ్చే ఆహారం, చక్కగా తయారుచేసిన ఆహారం, సమృద్ధిగా ఇవ్వాలి. CDTel 268.3