Go to full page →

వివిధ దేశాల్లో స్థానిక ఉత్పత్తుల నుంచి ఆహారపదార్థాలు CDTel 282

MS 40, 1902 CDTel 282.1

407. ఆరోగ్య ఆహారపదార్ధాల గురించి అనేక స్థలాల్లో అనేకమందికి ప్రభువు వివేకాన్నిస్తాడు. ఆయన అరణ్యంలో విందు ఏర్పాటు చెయ్యగలడు. ఆరోగ్య సంస్కరణ నియమాలని ఆచరించటానికి ప్రయత్నించే మన సంఘాలు ఆరోగ్య ఆహారపదార్థాల్ని తయారుచెయ్యాలి. అయితే వారీపని చేస్తున్నప్పుడు కొందరు తమ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదంటారు. కానీ ఈ ఆహారపదార్థాల్ని తయారు చెయ్యటానికి తమకు వివేకం ఇచ్చిందెవరు? పరలోకంలో ఉన్న దేవుడే కదా. ఆ దేవుడే పలుదేశాల్లో ఉన్న తన ప్రజలకు తమ తమ దేశాల్లోని ఉత్పత్తుల్ని వినియోగించి ఆరోగ్య ఆహారపదార్థాల్ని తయారు చెయ్యటానికి వివేకాన్నిస్తాడు. మన ప్రజలు తాము నివసిస్తున్న దేశాల్లో లభించే పండ్లు గింజలు, దుంపల పై సామాన్య, వ్యావహారిక మార్గాల్లో పరిశోధన జరపాలి. వివిధ దేశాల్లో ఎక్కువ ఖర్చులేని ఆరోగ్య ఆహారపదార్థాల్ని పేద ప్రజల కోసం, మన ప్రజల కుటుంబాల వినియోగం కోసం ఉత్పత్తి చెయ్యటం జరగాలి. CDTel 282.2

విదేశాల్లో ఉన్న తన ప్రజలు ఆరోగ్య ఆహారపదార్ధాల సరఫరాకు అమెరికా దిగుమతులపై ఆధారపడ కూడదన్నది ప్రభువు నాకిచ్చిన వర్తమానం. వాటి రవాణా, వాటి పై సుంకం వలన ఈ ఆహార ఆహారపదార్థాలు పేదలు కొనలేనంత ఖరీదైనవి అవుతాయి. వారు వాటి ప్రయోజనాన్ని పొందలేరు. దేవుని దృష్టికి గొప్పవారు ఎంత విలువైనవారో పేదప్రజలూ అంతే విలువైనవారు. CDTel 282.3

ఆరోగ్య ఆహారపదార్ధాలు దేవుని ఉత్పత్తులు. చూపలాల్ని సామాన్యంగా, చౌకగా, ఆరోగ్యవంతంగా ఉండేటట్లు మిశ్రమం చేసి ఆరోగ్యవంతమైన ఆహారం తయారుచేసుకోటం మిషనెరీ సేవ జరుగుతున్న దేశాల్లోని తన ప్రజలకి దేవుడు నేర్పిస్తాడు. వారు వివేకం కోసం ఆయనకి ప్రార్థిస్తే ఈ ఉత్పత్తుల నిమిత్తం ఎలా ప్రణాళికలు వేయాలో, వాటిని ఎలా వినియోగించాలో ఆయన వారికి నేర్పిస్తాడు. వారిని వారించవద్దు అన్నది నాకు వచ్చిన ఉపదేశం. CDTel 282.4