Go to full page →

ప్రగతి చెందిన ఆరోగ్య సంస్కరణ — శలకు ముందు ఆరోగ్య ఆహారపదార్థాలు CDTel 283

ఉత్తరం 98, 1901 CDTel 283.1

408. మీరు ఎక్కడ సేవ చేస్తున్నారో అక్కడ ఆరోగ్య ఆహార పదార్థాలు తయారు చెయ్యటం గురించి నేర్చుకోవలసింది చాలా ఉంటుంది. పూర్తిగా ఆరోగ్యవంతమైన, అయినా చౌకైన ఆహారపదార్ధాల్ని తయారుచెయ్యాలి. ఆరోగ్యాన్ని గూర్చిన సువార్తని పేదలకి ప్రకటించాలి. సత్యాన్ని స్వీకరించినందువల్ల ఉద్యోగం కోల్పోయిన వారికి ఈ ఆరోగ్య ఆహారాల ఉత్పత్తిలో జీవనోపాధి సంపాదించుకునే మార్గాలు ఏర్పడ్డాయి. దేవుడిచ్చే ఉత్పత్తుల్ని ప్రజలు తమకోసం తయారు చేసుకోగల ఆరోగ్య ఆహార పదార్థాలుగా ఉత్పత్తి చెయ్యాలి. అప్పుడు మనం ఆరోగ్య సంస్కరణ నియమాల్ని సముచితంగా సమర్పించగలుగుతాం. వినే వారు ఈ నియమాల స్థిరత్వాన్ని గుర్తించి వాటిని అంగీకరిస్తారు. కాని రుచిగల, బలవర్ధకమైన అయినా చౌకైన ఆహార పదార్థాల్ని సమర్పించే వరకు మనం ఆరోగ్య సంస్కరణలో ప్రగతి చెందిన దశలని సమర్పించకూడదు. CDTel 283.2

(వ్యక్తిగత వరాల వృద్ధికి ప్రోత్సాహం-376) CDTel 283.3

(1902) 7T 132 CDTel 283.4

409. సత్యం ఎక్కడ ప్రకటిటమౌతుందో అక్కడ ఆరోగ్య ఆహార పదార్థాలు తయారు చెయ్యటానికి ఉపదేశమివ్వాలి. ప్రతీ స్థలంలోను ప్రజలకి అక్కడ సులభంగా లభించే ఉత్పత్తుల్ని వినియోగించటం నేర్పించాలని దేవుడు కోరుతున్నాడు. తాము నివసిస్తున్న ప్రాంతంలో తాము పండించే ఫలాల్ని లేదా తమకు లభించే ఫలాల్ని ఎలా ఉపయోగించుకోగలరో ప్రజలకు చూపించటానికి నిపుణత గల శిక్షకులు అవసరం. ఈ విధంగా పేదవారు, మంచి పరిస్థితిలో ఉన్నవారు ఆరోగ్యంగా నివసించటం నేర్చుకోవచ్చు. CDTel 283.5