Go to full page →

నోరూరించే వంటకాలు CDTel 306

ఉత్తరం 54, 1907 CDTel 306.4

440. లోకాశలుగల మనసుల్ని ఆరోగ్య సంస్కరణకు అనుకూలంగా ఒక్కసారిగా మలచలేం. అందుచేత రోగుల ఆహారం విషయంలో మనం కఠిన నిబంధనలు రూపొందిచకూడదు. లౌకికులైన రోగులు ఆసుపత్రికి వచ్చినప్పుడు తమ ఆహారంలో గొప్ప మార్పు చేసుకోవాల్సి వస్తుంది. ఆ మార్పు ఏమంత చెప్పుకోదగ్గదిగా అనిపించ కుండా ఆహారం ఆరోగ్యవంతంగాను, రుచిగాను ఆకర్షణీయంగాను తయారుచేసి భోజన బల్లల మీద పెట్టాలి.... CDTel 306.5

భోజనానికి, చికిత్సకు డబ్బు కట్టేవారికి రుచిగా తయారు చేసిన ఆహారం సరఫరా చెయ్యాలి. దీనికి కారణం తెలిసిందే. రోగులకి మాంసాహారం ఇవ్వనప్పుడు ఆ మార్పుని శరీరవ్యవస్థ గ్రహిస్తుంది. ఒక రకమైన వంచన భావం కలుగుతుంది. కనుక వారు తమ ఆహార విషయంలో ఉదారవైఖరిని కోరతారు. ఆకలి పుట్టించే, చూపుకి ఇంపుగా ఉండే వంటకాల్ని తయారు చెయ్యాలి. CDTel 306.6