Go to full page →

కదలలేని రోగులకి ఆహార పదార్థాలు CDTel 307

ఉత్తరం 771, 1903 CDTel 307.1

441. రోగులకి భోజనం ఉదారంగా వడ్డించాలి. అయితే వ్యాధిగ్రస్తులికి ఆహారం తయారు చెయ్యటంలోను ఆహారపదార్థాలు మిశ్రమం చెయ్యటంలోను శ్రద్ధ తీసుకోవాలి. హోటల్లో భోజనబల్లని ఆహార పదార్థాలతో నింపినట్లు ఓ ఆసుపత్రిలోని భోజనబల్లని నింపటానికి కుదరదు. ఆహారం ఆరోగ్యంగా ఉండి దేనినైనా జీర్ణించుకోగల మనుషుల ముందు పెట్టటంలోను, వ్యాధిగ్రస్తులై కదలలేని స్థితిలో ఉన్నవారి ముందు పెట్టటంలోను భేదం ఎంతో ఉంటుంది. CDTel 307.2

తిండి బోతు తనాన్ని ప్రోత్సహించేంత ఆహార సమృద్ధిగల వాతావరణం నుంచి వచ్చే మనుషులికి మిక్కిలి పరిమితమైన ఆహారం ఇచ్చే ప్రమాదం ఉంది. వంటకాల్ని ఉదారంగా తయారుచెయ్యాలి. అదే సమయంలో అవి సామాన్యంగా ఉండాలి. ఆహారాన్ని సాదాగాను, అయినా కమ్మగాను విలాస భోజనానికి అలవాటు పడ్డవారికి నచ్చేరీతిగాను తయారు చెయ్యవచ్చని నాకు తెలుసు. CDTel 307.3

భోజనబల్లల మీద పండ్లను సమృద్ధిగా పెట్టండి. ఆసుపత్రి భోజనశాలలోని భోజనబల్లల పై పెట్టటానికి మీ పళ్ల తోటల నుంచి పళ్లు మీరు సరఫరా చేయగలగటం నాకు ఆనందంగా ఉంది. ఇది ఎంతో లాభదాయకం. CDTel 307.4

[ప్రతీ వ్యక్తి కూరగాయలు ఉపయోగించలేడు-516] CDTel 307.5