Go to full page →

ఆసుపత్రి భోజనబల్ల నేర్పేవిద్య CDTel 307

ఉత్తరం 71, 1896 CDTel 307.6

442. ఆహారం తయారు చెయ్యటంలో బంగారు వెలుగు కిరణాల్ని ప్రకాశింపజేస్తూ ఎలా నివసించాలో భోజనబల్లల వద్ద కూర్చునే వారికి నేర్పాలి. ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించే వారు దానినుంచి సంస్కరణ నియమాల్ని తీసుకువెళ్లేందుకు వారికి కూడా ఈ విద్యను అందించాలి CDTel 307.7

ఉత్తరం 73, 1905 CDTel 308.1

443. ఆసుపత్రి రోగుల కోసం ఆహారం తయారుచెయ్యటం పై శ్రద్ధ పెట్టాలి. రోగులలో కొందరు ప్రతీరోజు విలాసవంతమైన భోజనం సమృద్ధిగా ఉండే గృహాలనుంచి వస్తారు. వారి ముందు కమ్మని, ఆరోగ్యవంతమైన భోజనం పెట్టాలి ఆరోగ్యసంస్కరణని సిఫారసు చెయ్యటానికి మీకు ఏ సంస్థ తో సంబంధముందో అది లోకంలో మిక్కిలి తృప్తికరమైన, మిక్కిలి ఆనందకరమైన సంస్థల్లో ఒకటిగా ఉండాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. ఆరోగ్యానికి హాని కలిగించని, అదే సమయంలో ఆరోగ్య సంస్కరణ నియమాల్ని సిఫారసు చేసే ఆహారాన్ని రోగులకి సరఫరా చెయ్యటానికి మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను. దీన్ని చెయ్యవచ్చు. చేస్తే అది రోగుల మనసుల్ని ఆకట్టుకుంటుంది. తమ జీవిత సరళికన్నా ఉన్నతం ఆరోగ్యదాయకం అయిన జీవితం వలన లాభాల్ని చూపిస్తే అది వారికి విజ్ఞానదాయకంగా ఉంటుంది. ఆసుపత్రినుంచి వెళ్లిపోయేటప్పుడు, వారు తీసుకువెళ్లే నివేదిక అనేకుల్ని ఆ సంస్థకు వెళ్లేటట్లు ప్రభావితం చేస్తుంది. CDTel 308.2