Go to full page →

సహాయకుల భోజన బల్ల CDTel 308

ఉత్తరం 541896 CDTel 308.3

444. ఓ పనివాడి పోషణపట్ల మీరు శ్రద్ధ చూపరు. అది తక్కువ విషయంగా భావించి పనివారికి సమృద్ధిగా ఆహారం ఇవ్వరు. వారికి తాజా, ఆరోగ్యదాయక ఆహారం అవసరం. వారికి నిత్యం పని ఉంటుంది. వారి జీవశక్తి పరిరక్షణ అవసరం. వారిలో నియమాల్ని పెంచాలి. ఆసుపత్రిలో ఉన్న వారందరికి ఉత్తమమైన, ఆరోగ్యదాయకమైన, బలవర్ధకమైన ఆహారం సమృద్ధిగా ఇవ్వటం అవసరం. మీ సహాయ కుల భోజనబల్ల మాంస పదార్థాలతో కాదు మంచి పండ్లు, గింజలు, కూరగాయలతో తయారుచేసిన ఆరోగ్యకరమైన ఆహారంతో నిండి ఉండాలి. ఇది చెయ్యటంలో మీ అశ్రద్ధ మీ ఆదాయాన్ని పెంచుతుంది. కాని మీ పనివారి శక్తిని, వారి ఆత్మల్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇది దేవునికి ఆనందం కలిగించదు. మీ ఆహారం మొత్తం ప్రభావం సహాయకుల బల్లవద్ద భోజనం చేసేవారికి మీ నియమాల్ని సిఫారసు చెయ్యదు. CDTel 308.4