Go to full page →

అతి తిండికి శోధన CDTel 343

ఉత్తరం 73a, 1896 CDTel 343.12

538. వ్యవస్థ పోషణకు అవసరమైన ఆహారం కడుపుకి అందినప్పుడు, పైలు, ఫుడ్డింగులతో కూడిన మరో పదార్థం అనేక భోజన బల్లల మీద పెడతారు..... అనేకమంది అప్పటికే తాము సరిపడా భుజించినప్పటికీ, హద్దు దాటి, శోధనగా ఉన్న ఆ తీపి పదార్థాల్ని తింటారు. అవి వారికి మేలు కాదు, ఎంతో కీడు చేస్తాయి..... తీపి పదార్థాల రూపంలో ఉన్న ఆ అదనాల్ని పూర్తిగా విడిచి పెడితే, గొప్ప మేలు జరుగుతుంది. CDTel 343.13

(1864) Sp. Gifts I V, 130 CDTel 344.1

539. అది ఫ్యాషను గనుక వారు అనారోగ్యకరమైన ఆకలికి అనుగుణంగా, కేకులు, పయిలు, ఫుడ్డింగులు ప్రతీరకమైన హానికరమైన పదార్ధం కడుపులో కూర్తారు. పలు రకాలతో భోజనబల్ల నిండకపోతే వారి వక్ర ఆకలి తీరదు. ఈ తిండి బానిసల నోరు ఉదయం వాసన కొడుతుంది, నాలుక పాచితో బెరడు కట్టి ఉంటుంది. వారికి ఆరోగ్యముండదు. బాధలు, తలనొప్పి, రకరకాల అనారోగ్యం తమకు ఎందుకు వస్తున్నాయా అని వారు ఆశ్చర్యపడ్డారు. CDTel 344.2

(1865) H&L., అధ్యా.1, పుట.53 CDTel 344.3

540. ప్రీతికరమైన ఆహారపదార్థాలతో పొట్టను నింపటం ఓ ఫ్యాషను అయ్యేంత వరకు మానవ కుటుంబం విలాసవంతమైన భోజనాన్ని కోరుకుంటుంది. ముఖ్యంగా వినోద సమావేశాల్లో హద్దులేకుండా తిని తాగటం జరుగుతుంది. పోపు పెట్టిన పులుసుతో నిండిన మాంసం, కేకులు, పైలు, ఐస్ క్రీమ్ తో కూడిన విందులు, రాత్రి భోజనాలు తినటం జరుగుతుంది. CDTel 344.4

(1865) H&L., అధ్యా.1, పుట.54 CDTel 344.5

541. సందర్శించేవారి కోసం పలు రకాల వంటకాలు, కేకులు, పైలు, విలాస భోజనాలు, తయారు చెయ్యటం ఫ్యాషను కాబట్టి పేదవారు, ప్రతీరోజూ పనిచెయ్యనిదే గడవని వారు అనేకమంది ఎంతో డబ్బు ఖర్చు పెడతారు. ఆ భోజనం తినేవారికి హాని తప్ప మేలు జరగదు. అదే సమయంలో తమ పిల్లలకి అవసరమయిన బట్టలు కొనటానికి వారలా వ్యయం చేసే డబ్బు అవసరమౌతుంది. రుచిని తృప్తి పర్చటానికి కడుపుకి హాని చేసే భోజనాన్ని తయారు చెయ్యటానికి ఉపయోగించే సమయాన్ని వారు తమ బిడ్డలకి నైతికమైన, మత సంబంధమైన ఉపదేశం ఇవ్వటానికి వినియోగించాలి. CDTel 344.6

[సందర్భానికి 128 చూడండి] CDTel 345.1

[విలాసవంతమైన ఆహారపదార్థాలు ప్రేరకాలకి వాంఛ సృష్టిస్తాయి-203] CDTel 345.2