Go to full page →

ఆరోగ్యకరమైన, బలవర్థకమైన ఆహారంలో భాగం కాదు CDTel 345

(Y.I., మే 31, 1894) CDTel 345.3

542. అనేకమందికి రకరకాల కేకులు చెయ్యటం తెలుసు. కానీ భోజనబల్ల పై పెట్టటానికి కేకు ఉత్తమ ఆహారం కాదు. తీయని కేకులు, ఫుడ్డింగులు, కస్టలు జీర్ణమండల అవయవాల పనిని అస్తవ్యస్తం చేస్తాయి. భోజనానికి కూర్చున్నవారి ముందు అలాంటి ఆహారం పెట్టి వారిని ఎందుకు శోధించాలి? CDTel 345.4

(1870) 2T 400 CDTel 345.5

543. మాంసాహారం, కేకులు, ఎలాంటి మసాలాలతోనైనా తయారుచేసిన పైలు మిక్కిలి ఆరోగ్యదాయకమైన, బలవర్ధకమైన ఆహారం కాదు. CDTel 345.6

ఉత్తరం 91, 1898 CDTel 345.7

544. కస్టల్ రూపంలో తినే తీపి పదార్థాలు మేలు కన్నా ఎక్కువ హాని చేసే అవకాశముంది. పండ్లు మంచి ఆహారం. CDTel 345.8

(1905) M.H. 302 CDTel 345.9

545. ఆహారంలో సామాన్యంగా ఎక్కువ పంచదార వాడటం జరుగుతున్నది. కేకులు, తియ్యని పుడ్డింగులు, పేస్టీలు, జెల్లీలు, జెమ్ లు అజీర్తికి ముఖ్య కారణాలు. పాలు, గుడ్లు, పంచదార ప్రధాన దినుసులైన కస్టర్డు, ఫుడ్డింగులు మిక్కిలి హానికరమైనవి. పాలు పంచదార కలిపి యధేచ్చగా తీసుకోటం మానాలి. CDTel 345.10

ఉత్తరం 135, 1902 CDTel 345.11

546. ఆరోగ్య సంస్కరణ ఏవి ఒనగూర్చుతుందని దాని ప్రబోధకులు చెబుతున్నారో అవి జరిగేందుకు వారు చిత్తశుద్ధితో కృషి చెయ్యాలి. ఆరోగ్యానికి హాని కలిగించే సమస్తాన్ని విడిచి పెట్టటానికి వారు కృతనిశ్చయులవ్వాలి. సామాన్య ఆరోగ్యదాయక ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లు శ్రేష్ఠం. అవి వంటని చాలామట్టుకు తగ్గిస్తాయి. పే స్త్రీలు, కేకులు, తీపి పదార్థాల వంటి నోరూరించే తినుబండారాల్ని ముట్టకండి. ఒకే భోజనంలో తక్కువ రకాల వంటకాలు తినండి. కృతజ్ఞతతో తినండి. CDTel 345.12