Go to full page →

సామాన్య తీపి పదార్థాలు నిషిద్ధం కాదు CDTel 346

ఉత్తరం 17, 1895 CDTel 346.1

547. భోజనం చివర సామాన్యమైన పై తీపి వస్తువుగా సరిపోతుంది. కాని ఓ వ్యక్తి తన విపరీతమైన అభిరుచిని తృప్తిపర్చుకోటానికి రెండు లేక మూడు పై ముక్కలు తిన్నప్పుడు, అతడు దేవుని సేవకు అపాత్రుడవుతాడు. కొందరు ఇతర ఆహారం తిన్న తర్వాత తీపి పదార్ధం ఏదో తింటారు. ఆకలి తీరక కాదు. రుచిగా ఉన్నందుకు. మరో ముక్క తినమని అడగటం జరిగితే, శోధన ప్రతిఘటించలేనంత బలం పుంజుకుంటుంది. అప్పటికే పెనుభారం కింద సతమతమౌతున్న కడుపు పై రెండు మూడు ముక్కల అదనపు భారం పడుతుంది. ఈ పనిచేసే వ్యక్తి ఆత్మత్యాగం పాటించని వ్యక్తి. తిండికి బానిస అయిన వ్యక్తి. ఈ అలవాటులో ఎంత స్థిరంగా నిలుస్తాడంటే అది తనకు చేసే హానిని ఏమాత్రం చూడడు. CDTel 346.2

(1870) 2T 383,384 CDTel 346.3

548. ఆమెకి అదనపు దుస్తులు, సామాన్యమైన, అయినా పోషక విలువలుగల ఆహారం అవసరమైనప్పుడు అతడు ఆమెకివ్వలేదు. రక్తంగా మార్చటానికి అవసరమైన ఆహార పదార్థాల్ని ఆమె వ్యవస్థ కోరింది. కాని దాన్ని అతడు ఆమెకివ్వలేదు. మిత పరిమాణంలో పాలు, పంచదార, కొంచెం ఉప్పు, యీస్ట్ వల్ల పొంగిన తెల్లని బ్రెడ్డు, ఇతరులు సంపూర్ణ గోధుమపిండితో చేసిన వివిధ పదార్థాలు, కిస్మిలో చేసిన సామాన్యమైన కేకు, కిస్ మిస్ తో చేసిన వరిపిండి పుడ్డింగ్, ఫ్రూన్లు, అత్తిపండ్లు, ఇంకా అనేక ఇతర వంటకాలు ఆకలిని సంతుష్టి పర్చేవి. CDTel 346.4

ఉత్తరం 127, 1904 CDTel 346.5

549. రోగుల ముందు పెట్టే ఆహారం వారికి మంచి అభిప్రాయం కలిగించేటట్లు ఉండాలి. గుడ్డుల్ని పలు విధాలుగా తయారు చెయ్యవచ్చు. నిమ్మపైని నిషేధించకూడదు. CDTel 346.6

[ఇ.జి. వైట్ వినియోగించిన నిమ్మపై - అనుబంధం 1:25] CDTel 347.1

ఉత్తరం 53, 1898 CDTel 347.2

550. తీపి పదార్థాల్ని భోజనబల్లమీద పెట్టి తక్కిన ఆహారంతో వడ్డించాలి. ఎందుకంటే, కడుపుకి ఎంత ఆహారం అవసరమో అంత సరఫరా అయిన తర్వాత తీపి పదార్థాన్ని తెస్తారు. అది అదనమౌతుంది. CDTel 347.3