Go to full page →

నిర్మల మనసు, బలమైన శరీరం CDTel 347

ఉత్తరం 10, 1891 CDTel 347.4

551. మనందరం ఆరోగ్య సంస్కర్తలమవ్వాలని నా కోరిక. పేస్ట్రీల వినియోగానికి నేను వ్యతిరేకం. ఈ మిశ్రమాలు అనారోగ్యకరం. తీపి పిండి వంటలు, క్రీమ్ కేకులు, రకరకాల పైలు, ఒకే భోజనంలో ఎక్కువ రకాల వంటకాలు తినేవారికి జీర్ణశక్తి, నిర్మలమైన మెదడు ఉండవు. ఇలా తిని జలుబుకి గురి అయినప్పుడు వ్యవస్థంతా మూసుకుపోయి బలహీన మౌతుంది. వ్యాధిని ప్రతిఘటించే శక్తి ఉండదు. అంత ఎక్కువగా తీపి కేకులు, పే స్త్రీలు తినేకన్నా నేను మాంసాహారమే మేలని ఎంపిక చేసుకుంటాను. CDTel 347.5

ఉత్తరం 142, 1900 CDTel 347.6

552. ఆరోగ్యసంస్కరణని సిఫారసు చెయ్యని రెసిపీలని ప్రచురం చెయ్యటం ద్వారా తాము ఆరోగ్యసంస్కరణకు విఘాతం కలిగిస్తున్నామని ఆరోగ్యసంస్కర్తలు జ్ఞాపకముంచుకోవాలి. కస్ట లకి, పే స్త్రీలకి రెసిపీలివ్వటంలో జాగ్రత్త వహించాలి. తీపి పదార్థంగా పాలతో గాని మీగడతో గాని తీపి కేకు తీసుకుంటే కడుపులో పులియటం జరుగుతుంది. అంతట మానవ యంత్రాంగంలోని బలహీన విషయాలు బయలు పడతాయి. కడుపులోని గందరగోళం మెదడుని ప్రభావితం చేస్తుంది. మనుషులు కార్యాన్ని కారణాన్ని అధ్యయనం చేసి, జీర్ణమండల అవయవాలికి హాని కలిగించి, తలనొప్పి పుట్టించే ఆహారాన్ని విసర్జిస్తే దీన్ని బాగుచెయ్యటం సులభమే. సామాన్య భోజనం తింటే ఏ హానీ లేకుండా తాము చెయ్యగల పనికి అనుచితంగా తినటం వల్ల పురుషులు, స్త్రీలు తమని తాము అనర్హుల్ని చేసుకుంటున్నారు. CDTel 347.7

553. తమ వంటలో ఆరోగ్యనియమాల్ని ఆచరిస్తే, శిబిర సమావేశాలకి సిద్ధపడటంలో వారు తమని తాము రోగుల్ని చేసుకోనవసరం లేదన్నది నాగట్టి నమ్మకం. కేకుగాని, పైగాని చెయ్యకుండా సంపూర్ణ గోధుమలతో సామాన్యంగా తయారు చేసుకున్న బ్రెడ్ మీద క్యాన్ చేసిన లేదా ఎండబెట్టిన పండ్ల మీద ఆధారపడితే శిబిర సమావేశాలకి సిద్ధపడటంలో వారు జబ్బు పడాల్సిన పని ఉండదు. CDTel 348.1

R.& H., జనవరి 7, 1902 CDTel 348.2

554. తీపి తినుబండారాల్ని ముట్టకుండటం మంచిది. భోజన బల్లమీద పెట్టిన తీపి పదార్ధాల జోలికి పోకండి. అవి మీకు అవసరం లేదు. దేవుని గురించి తలంచటానికి మీకు స్పష్టమైన మనసు అవసరం. ఇప్పుడు మనం ఆరోగ్యసంస్కరణ నియమాలకి అనుగుణంగా నడవాలి. CDTel 348.3

[విందుల్లోను, అర్ధరాత్రి భోజనాల్లోను ఇచ్చే కేకులు, పైలు-233] CDTel 348.4

[జరిగే సమావేశాలకి శైలుగా సిద్ధబాటు-123] CDTel 348.5

[సాదా భోజనానికి కడుపుని తర్చీతు చెయ్యటం-245] CDTel 348.6

[వక్రతిండిని అధిగమించటానికి ఉపవాసం సహాయం-312] CDTel 348.7

[క్రైమా పైలు, మసాలాలు మొదలైన వాటిని విసర్జించినా, ఆహారాన్ని జాగ్రత్తగా తయారు చెయ్యాలి-389] CDTel 348.8

[కేకులు లేక పైలు శిబిర సమావేశాలకి సిద్ధబాటులో భాగం కాకూడదు -57,74] CDTel 348.9

[వైట్ గృహంలో విలాస భోజనం, తీపి పదార్థాలు లేవు-అనుబంధం 1:4,13.] CDTel 348.10

[సువాసన ద్రవ్యాలు, తీపి పదార్థాలు ఎంత తక్కువ వాడితే అంత మంచిది. - 193] CDTel 348.11

[కూరగాయలతో వడ్డించే తీపి పదార్థాలు-723] CDTel 348.12

[పేస్త్రీలు కడుపుని గందరగోళపర్చి, నరాల్ని ఉద్రిక్తం చేస్తాయి-556] CDTel 348.13

[చిన్న పిల్లల ఆహారంలో తీపి వస్తువుల హానికర పర్యవసానాలు-288,350, 353,360] CDTel 348.14

[శరీర శ్రమ లేని పని చేసేవారికి విలాస భోజనం మంచిది కాదు-225] CDTel 348.15

[విలాస భోజనాలు తినమని దేవునితో ఒడంబడిక చేసుకోటం-41] CDTel 348.16