Go to full page →

భాగం III - ఉప్పు CDTel 356

(1905) M.H.305 CDTel 356.1

570. ఉప్పు ఎక్కువ తినొద్దు. పచ్చళ్లు, మసాలాలతో చేసిన వంటలు ముట్టకండి. పండ్లు విరివిగా తినండి. భోజన సమయంలో విస్తారమైన పానీయాలు కోరే మంట చాలా మట్టుకు మాయమౌతుంది. CDTel 356.2

(1909) 9T 102 CDTel 356.3

571. ఆహారాన్ని రుచిగాను, పోషణనిచ్చేరీతిగాను తయారు చెయ్యాలి. శరీర వ్యవస్థకు అవసరమైన పోషణని అది సమకూర్చాలి. నేను కొంత ఉప్పు ఉపయోగిస్తాను. హానికరంగా ఉండే బదులు అది రక్తానికి అగత్యం . CDTel 356.4

ఉత్తరం 37, 1901 CDTel 356.5

572. ఓసారి డా. — తాను గ్రహించిన రీతిగా ఆరోగ్య సంస్కరణానుసా రంగా ఉప్పుగానీ మరే ఇతర దినుసుగానీ పోపు చెయ్యటానికి లేకుండా వంటచెయ్యటం మా కుటుంబానికి నేర్పటానికి ప్రయత్నించాడు. దాన్ని చెయ్యటానికి నిశ్చయించుకున్నాను. అయితే దాని ఫలితంగా నా శక్తి చాలా తగ్గిపోయింది. దాన్ని మార్చుకుని, మరో విధానాన్ని అనుసరించాల్సి వచ్చింది. అది విజయవంతమయ్యింది. ఇది నీ కెందుకు చెప్పాల్సివచ్చిందంటే నీవు పెద్ద ప్రమాదంలో ఉన్నట్లు కనిపిస్తున్నావు. ఆహారాన్ని పోషణనిచ్చే రీతిగా తయారు చెయ్యాలి. అది వ్యవస్థ కు అగత్యమైనదాన్ని దోచుకోకూడదు.... CDTel 356.6

నేను కొద్దిగా ఉప్పు ఉపయోగిస్తాను. ఎందుకంటే దేవుడు నాకిచ్చిన వెలుగునుబట్టి ఈ పదార్ధం హాని చేసేబదులు రక్తానికి అత్యవసరం. దాని లోతుపాతులు నాకు ఎక్కువ తెలియవుగాని, నాకు వచ్చిన ఉపదేశం ఇది. అది నీకు ఇస్తున్నాను: CDTel 357.1

[కొంత ఉప్పు ఉపయోగించటం అవసరం-548] CDTel 357.2

[ఉప్పు అనుచిత పరిమాణంలో వాడవద్దు-558] CDTel 357.3

[ఇ.జి.వైట్ కొంచెం ఉప్పు ఉపయోగించింది అనుబంధం 1:4] CDTel 357.4