(1905) M. H.325 CDTel 357.5
573. వేగం ప్రధానమైన ఈ యుగంలో ఆహారం ఎంత నిరుద్రేకంగా ఉంటే అంత మంచిది. మసాలాలు స్వాభావికంగా హానికరమైనవి. ఆవాలు, మిరియాలు, మసాలాలు, పచ్చళ్లు ఇలాంటి ఇతర పదార్థాలు కడుపులో మంట పుట్టించి, రక్తాన్ని వేడిచేసి, చెడు రక్తంగా మార్చుతాయి. CDTel 357.6
[C.T.B.H.61,62] (1890)F.E.150, 151 CDTel 357.7
574. పన్నెండేళ్లలోపు వయసుగల అనేకమంది పిల్లలతో కలిసి ఓసారి భోజనబల్ల వద్ద భోజనానికి కూర్చున్నాను. మాంసం విస్తారంగా వడ్డించారు. అంతట బలహీనురాలు, పిరికిది అయిన ఓ అమ్మాయి పచ్చడి కావాలని కోరింది. చౌప్ చౌతోను, ఆవాలు, మసాలాతోను, ఘాటుగా చేసిన పచ్చడి సీసా ఆమెకందించగా ఆ అమ్మాయి దాన్ని విచ్చలవిడిగా తిన్నది. పిరికితనానికి, ముక్కు మీద కోపానికి ఆ పిల్ల ఓ సామెతగా ఉండేది. కారంగా ఉండే ఈ మసాలాలు ఇలాంటి పరిస్థితినే సృష్టిస్తాయి. CDTel 357.8
(1870) 2T 368 CDTel 357.9
575. మానవుడి కడుపులోకి ప్రవేశించకూడని కయిమా పైలు, పచ్చళ్లు నాణ్యత బొత్తిగా లేని రక్తాన్ని తయారు చేస్తాయి. CDTel 357.10
(1870) 2T 383 CDTel 357.11
576. రక్తాన్ని ఉత్పత్తిచేసే అవయవాలు మసాలాలు, కైమా పైలు, పచ్చళ్లని వ్యాధిగ్రస్తమైన జంతుమాంసాన్ని మంచి రక్తంగా మార్చలేవు. CDTel 357.12
(సందర్భానికి 336 చూడండి] CDTel 357.13
(1905) M.H.305 CDTel 358.1
577. ఉప్పు ఎక్కువగా తినొద్దు. పచ్చళ్లు మసాలతో చేసిన ఆహారం తినవద్దు. పండ్లు విరివిగా తినండి. భోజనం చేసేటప్పుడు ఎక్కువ పానీయాన్ని కోరే మంట, చాలామట్టుకు మాయమౌతుంది. CDTel 358.2
[పచ్చళ్లు కడుపుని కందింపజేసి, రక్తాన్ని చెడురక్తంగా మార్చుతాయి-556] CDTel 358.3