Go to full page →

బటర్ బదులు ఒలీవలు, వెన్న, పప్పులు CDTel 360

ఆరోగ్యఆహారపదార్థాల వినియోగం CDTel 360.8

(1902) 7T 134 CDTel 360.9

581. ఒలీవాల్ని సముచితంగా తయారుచేసుకుని ప్రతీ భోజనంతోను తిని మంచి మేలు పొందవచ్చు. బటర్ వాడకం ద్వారా పొందాలని ఆశించే మేలు సరిగా తయారు చేసిన ఒలీవలు తినటం ద్వారా పొందవచ్చు. ఒలీవల్లోని నూనె మలబద్దాన్ని నివారిస్తుంది. క్షయ రోగులకి, కడుపులో మంటతో బాధపడేవారికి అది మందుకన్నా ఎక్కువ మేలు చేస్తుంది. జంతువుల నుంచి పరోక్షంగా వచ్చే ఎలాంటి నూనె కన్నా ఆహారంగా అది ఎంతో శ్రేష్ఠం. CDTel 360.10

(1905) M.H.298 CDTel 361.1

582. సరిగా తయారుచేసిన ఒలీవలు పప్పుల్లా, బటర్, మాంసపదార్థాల స్థానాన్ని భర్తీ చేస్తాయి. ఒలీవల్లో ఉన్న నూనె జంతువుల నూనె కన్నా లేక కొవ్వుకన్నా మేలైనది. అది విరేచనకారిగా పనిచేస్తుంది. క్షయ రోగులకి ఉపకారం చేస్తుంది. కడుపు మంటను తొలగిస్తుంది. CDTel 361.2

యూనియన్ కాన్ఫరెన్స్ రికార్డ్ (ఆ స్టైలేషియన్, జన.1, 1900 CDTel 361.3

583. ఆరోగ్య ఆహార వ్యాపారం కార్యసిద్ధి పొందటానికి ద్రవ్యం, మన ప్రజల క్రియాశీలక సహకారం అవసరం. పశువుల్లో ప్రబలుతున్న వ్యాధుల వల్ల అభ్యంతరకరమౌతున్న పాలు, బటర్ స్థానే వాడగల ఆహారపదార్థాల్ని మాంసం బదులు ఉపయోగించుకోగల ఆహారాన్ని, ప్రజలకి సరఫరా చెయ్యటం దాని ఉద్దేశం. CDTel 361.4

[బటర్ స్థానే వెన్న -586,610] CDTel 361.5