(1873) 3T 136 CDTel 361.6
584. మాంస పదార్థాలు, మసాలాలు, బటర్, చీజ్, పందిమాంసం, పే స్త్రీలు, మసాల కారం పిల్లల్ని తిననివ్వటం జరుగుతున్నది. వారిని క్రమం లేకుండా భోజనం తిననివ్వటం, మధ్య మధ్య అనారోగ్యదాయక భోజన పదార్థాలు తిననివ్వటం జరుగుతుంది. ఇవి కడుపుని గందరగోళపర్చటం, అస్వాభావిక పనులు చెయ్యటానికి నరాల్ని, ఉత్తేజపర్చటం, మనసుని బలహినం చెయ్యటం అన్న తమ పనులు చేస్తాయి. వ్యాధి మరణాన్ని తెచ్చే విత్తనాల్ని తాము ఇలా చల్లుతున్నామని తల్లిదండ్రులు గుర్తించరు. CDTel 361.7
[బటర్ ఓ ఉత్తేజకం-61] CDTel 361.8
[పిల్లలు బటర్ స్వేచ్చగా ఉపయోగించటం-288,356,364] CDTel 361.9
[నియమం ప్రకారం బటర్ని నిరాకరించటం-389] CDTel 361.10