Go to full page →

ఇతరుల నమ్మకాల్ని గౌరవించండి CDTel 363

(ఉత్తరం 331, 1904) M.M. 269 CDTel 363.1

588. లోకంలో అనేక రకాల మనసులున్నాయని, ఆహారం విషయంలో మనం చూసేటట్లే అందరూ చూడాలని ఎదురు చూడకూడదని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనసులు ఒకే ధోరణిలో ఆలోచించవు. నేను బటర్ తినను, కాని బటర్ తినేవారు నా కుటుంబంలో కొందరున్నారు. అది నా భోజనబల్లమీద ఉండదు. అయితే నా కుటుంబంలో కొందరు దాన్ని అప్పుడప్పుడు తింటున్నందుకు నేను గొడవ చెయ్యను. మనస్సాక్షి గల మన సహోదరుల్లో చాలామంది భోజనబల్లల మీద బటర్ ఉంటుంది. బటర్ తినవద్దని వారిని ఒత్తిడి చెయ్యటం నా బాధ్యత కాదు. పండ్లు సమృద్ధిగా ఉన్నచోట శుద్ధిచేయబడ్డ వెన్న లభించేచోట బటర్ అవసరం నాకు కనిపించదు. దేవున్ని ప్రేమించి సేవించేవారిని తమ సొంత అభిప్రాయాల్ని అనుసరింపనివ్వాలి. వారిలా ప్రవర్తించటం సమర్ధనీయం కాకపోవచ్చు, కాని అభిప్రాయబేధాలు అనైక్యతని సృష్టించకుండా చూసుకోవాలి. CDTel 363.2

589. నీవు ఆరోగ్య నియమాల ప్రకారం నివసించటానికి ప్రయత్నిస్తున్నావని ప్రతీ విషయంలోను పొదుపు పాటిస్తున్నావని గుర్తిస్తున్నాను. కాని శరీర వ్యవస్థకి అవసరమైన ఆహారాన్ని నిలుపు చెయ్యకు. పప్పులతో తయారు చేసే ఆహారపదార్థాల్ని తినలేనివారు చాలా మంది ఉన్నారు. నీ భర్తకి బటర్ ఇష్టమైతే, తన ఆరోగ్యానికి అది మంచిది కాదని గ్రహించేవరకు దాన్ని అతణ్ని తిననివ్వు. CDTel 363.3