Go to full page →

పిల్లలకి ఉత్తేజం కలిగించటం CDTel 379

(1870) 2T 362 CDTel 379.1

627. మీరు మీ పిల్లలకి ఉపదేశిస్తూ ఉండాలి. ఈ యుగంలోని దుర్మార్గాన్ని అవినీతిని ఎలా తప్పించుకుని నివసించాలో వారికి నేర్పించాలి. ఇదిచేసే బదులు తినటానికి కమ్మని భోజన పదార్థాలు ఎలా సంపాదించాలా అని అనేకమంది ఆలోచిస్తూ ఉంటారు. మీరు మీ భోజన బల్లల మీద బటర్, గుడ్లు, మాంసం పెడతారు. మీ పిల్లలు వాటిని తింటారు. వారిలోని పాశవిక ఉద్రేకాల్ని రెచ్చగొట్టే ఆహారంతో వారిని పెంచుతారు. ఆ తర్వాత మతపరమైన సమావేశాలకి వచ్చి మీ పిల్లల్ని ఆశీర్వదించమని రక్షించమని ప్రభువుకి ప్రార్థన చేస్తారు. మీ ప్రార్థనలు పైకి ఎంత దూరం వెళ్తాయి? ముందు మీరు చెయ్యాల్సిన పని ఉంది. మీ పిల్లల కోసం దేవుడు మీకిచ్చిన పని అంతటిని మీరు చేసినప్పుడు, మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేసిన ప్రత్యేక సహాయాన్ని అప్పుడు కోరవచ్చు. CDTel 379.2