Go to full page →

గుడ్లలోని పరిహారాత్మక గుణాలు; తీవ్రధోరణుల విషయం జాగ్రత్త CDTel 379

ఉత్తరం 37, 1901 CDTel 379.3

628. ఆరోగ్యసంస్కరణ విషయంలో తీవ్ర చర్యలు చేపట్టవద్దు. మన ప్రజల్లో కొందరు ఆరోగ్యసంస్కరణని గురించి చాలా అజాగ్రత్తగా ఉన్నారు. కొందరు వెనకబడి ఉన్నారు గనుక, వారికి మాదిరిగా ఉండటానికి మీరు తీవ్రచర్య చేపట్టకూడదు. మంచి రక్తం తయారుచేసే ఆ నాణ్యత గల ఆహారాన్ని తినకుండా మీకు మీరు హాని చేసుకోకూడదు. యదార్ధ నియమాల అవలంబన పట్ల మీ శ్రద్ధ మిమ్మల్ని ఆరోగ్య సంస్కరణకి ప్రతికూలమైన అనుభవానికి నడిపించే ఆహారానికి కట్టుబడేటట్లు చేస్తుంది. ఇది మీకున్న ప్రమాదం. మీరు శారీరకంగా బలహీనమౌతున్నట్లు గుర్తించినప్పుడు, వెంటనే మార్పులు చెయ్యటం ప్రధానం. మీ ఆహారంలో దేన్ని విడిచి పెట్టారో దాన్ని పునరుద్ధరించండి. ఇది చెయ్యటం మీ విధి. ఆరోగ్యంగా ఉన్న కోడి పెట్టల గుడ్లే వాడండి. వీటిని ఉడకబెట్టిగాని లేక పచ్చిగాగాని వాడండి. ఇది మీ శరీరానికి అవసరమైన పోషకాల్ని సరఫరా చేస్తుంది. ఇది చెయ్యటం మంచిది కాదని భావించకండి.... CDTel 379.4

పాలని ఇప్పటిలా స్వేచ్ఛగా ఉపయోగించటం క్షేమం కాని సమయం వస్తుంది. కాని దాన్ని విసర్జించాల్సిన సమయం ప్రస్తుత సమయం కాదు. గుడ్డుల్లో ఉన్న కొన్ని గుణాలు విషాల్ని నిర్వీర్యంచేసే మందుగా పనిచేస్తాయి...... CDTel 380.1