Go to full page →

మాంసాహారం పాప పర్యవసానం CDTel 385

(1864) Sp. Gifts IV, 120, 121 CDTel 385.2

639. మానవులు తినటానికి తాను ఏర్పాటు చేసిన ఆహారాన్ని దేవుడు మన మొదటి తల్లిదండ్రులు ఆదామవ్వలకిచ్చాడు. ఏ ప్రాణి ఉసురు తియ్యటమైనా ఆయన ప్రణాళికకి విరుద్ధం. ఏదెనులో మరణం ఉండవలసింది కాదు. తోటలోని చెట్ల ఫలాలు మానవుడి అవసరాలికి కావలసిన ఆహారం. జలప్రళయం అనంతరం వరకు మాంసం తినటానికి దేవుడు మానవుడికి అనుమతి ఇవ్వలేదు. మానవుడు తినగలిగినదంతా నాశనమయ్యింది. కనుక వారికి ఏర్పడ్డ అవసరాన్ని తీర్చటానికి ప్రభువు నోవహు ఓడలోకి తీసుకున్న పవిత్ర జంతువుల్ని తినటానికి అనుమతి నిచ్చాడు. కాని మానవుడికి మాంసం శ్రేష్ఠమైన ఆహార పదార్ధం కాదు. CDTel 385.3

జల ప్రళయానికి ముందు నివసించిన ప్రజలు తమ దుర్నీతి దుర్మార్గత పాత్ర నిండేవరకు మాంసం తింటూ తమ శరీరేచ్చలు తృప్తిపర్చుకుంటూ నివసించారు. భూమిపై పోగుపడ్డ నైతిక కశ్మలాన్ని దేవుడు ప్రళయ జలంతో కడిగివేశాడు. అవిధేయత కారణంగా మొదటి శాపాన్ని ఆదాము సంతతి పైన, భూమి పైన దేవుడు ప్రకటించాడు. కయీను తన తమ్ముడు హేబెలుని చంపిన తర్వాత దేవుని వద్దనుంచి వచ్చిన అతి భయంకరమైన మూడో శాపం జల ప్రళయమప్పుడు భూమి మీదకు వచ్చింది. CDTel 385.4

జల ప్రళయం తర్వాత ప్రజలు చాలావరకు మాంసం తిన్నారు. మానవుడి నడవడి దుర్మార్గంతో నిండిందని, అతడు తనని తాను తన సృష్టికర్తకు పైగా హెచ్చించుకోజూస్తున్నాడని, తన హృదయాలోచనల్నే అనుసరిస్తున్నాడని దేవుడు చూశాడు. కనుక దీర్ఘ కాలం జీవించే మానవ జాతి మాంసం తిని తమ జీవితపు నిడివి తగ్గించుకోవాలని వారు మాంసం తినటానికి అనుమతించాడు. జల ప్రళయం అనంతరం మానవజాతి దేహ పరిమాణం విషయంలోను, ఆయుఃకాలం విషయంలోను త్వరితంగా క్షీణించటం మొదలు పెట్టింది. CDTel 385.5