Go to full page →

జల ప్రళయ పూర్వప్రజల దుర్మార్గం CDTel 386

(1865) H. TO L., అధ్యా.1, పుట 52 CDTel 386.1

640. పురాతన ప్రపంచ ప్రజలు మితం లేకుండ తిని తాగారు. మాంసం తినటానికి దేవుడు అనుమతి ఇవ్వకపోయినప్పటికి వారు మాంసం భక్షించారు. అమితంగా తిని తాగారు. భ్రష్టమైన వారి తిండికి అంతు పొంతు లేకపోయింది. వారు దౌర్జన్యపూరితులు, క్రూరులు, దర్మారులు అయినందువల్ల దేవుడు ఇక ఎంతమాత్రం సహించకపోయాడు. వారి దుష్టత్వ పాత్ర నిండింది. భూమికి అంటిన ఆ నైతిక కల్మషాన్ని దేవుడు జలప్రళయంతో క్షాళన చేశాడు. జలప్రళయం దరమిలా భూమి పై ప్రజల సంఖ్య పెరిగే కొద్దీ వారు దేవున్ని మర్చిపోయి ఆయన ముందు భ్రష్టులయ్యారు. అన్ని రకాల అమితానుభవం పెచ్చు పెరిగింది. CDTel 386.2