Go to full page →

ఇశ్రాయేలు వైఫల్యం, ఆధ్యాత్మిక నష్టం CDTel 386

(1905) M. H. 311, 312 CDTel 386.3

641. మానవుడికి ఆదిలో ఏర్పాటైన ఆహారంలో మాంసం లేదు. జల ప్రళయం తర్వాత, భూమి పై పచ్చనిదంతా నశించిన తర్వాతే మనుషుడు మాంసం తినటానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. CDTel 386.4

ఏదెనులో మానవుడి ఆహారం ఎంపిక చెయ్యటంలో ఏది ఉత్తమ ఆహారమో ప్రభువు చూపించాడు. ఇశ్రాయేలీయులికి ఎంపిక చేసిన ఆహారం విషయంలోనూ అదే పాఠం బోధించాడు. ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకువచ్చి, వారు తన స్వకీయ సంపాద్యమైన ప్రజలుగా ఉండే నిమిత్తం వారిని తర్బీతు చెయ్యటం మొదలు పెట్టాడు. వారిద్వారా లోకాన్ని ఆశీర్వదించి లోక ప్రజలకి బోధించాలని ఆకాంక్షించాడు. ఈ కార్యానికి అనువుగా ఉండేటట్లు వారికి మాంసం కాదు “పరలోకాహారమైన” మన్నానిచ్చాడు. వారి అసంతృప్తి వలన, ఐగుప్తులో తాము తిన్న మాంసం కోసం గొణుగుకోటం వలన వారికి దేవుడు మాంసం ఇచ్చాడు. ఇది కొద్దికాలం మాత్రమే. అది తినటం వల్ల వేలమందికి వ్యాధి, మరణం సంభవించాయి. అయినా శాఖాహారానికి పరిమితమై ఉండటమన్న నియమం ఎన్నడూ మనస్పూర్తిగా అంగీకరించబడలేదు. ఇది నిత్యం అసంతృప్తికి, సణుగుడికి హేతువవుతూ వచ్చింది. CDTel 386.5

శాఖాహారం స్థిరనియమం కాలేదు. కవానులో స్థిరపడిన తర్వాత ఇశ్రాయలీయులు మాంసం తినటానికి దేవుడు అనుమతించాడు. కాని దుష్ఫలితాల్ని తగ్గించే ఉద్దేశంతో కొన్ని ఆంక్షలు విధించాడు. ఏవి అపవిత్రమైనవిగా పేర్కొబడుతున్నవో ఆ పందులు, పిట్టలు, చేపల మాంసం అవవిత్రం. అనుమతించబడుతున్న వాటి మాంసానికి సంబంధించిన కొవ్వు, రక్తం ఉపయోగించటం నిషిద్ధం. CDTel 387.1

మంచి పరిస్థితిలో ఉన్న జంతువుల మాంసం మాత్రమే తినాలి. చీల్చబడ్డ జంతువుని గాని, చచ్చిన దాన్ని గానీ లేక రక్తం ఓడ్చని జంతువుని గానీ తినకూడదు. CDTel 387.2

తమ ఆహారం నిమిత్తం దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక నుంచి తొలగిపోటం ద్వారా ఇశ్రాయేలీయులు ఎంతో కోల్పోయారు. వారు మాంసం కావాలని కోరారు. దాని ఫలితాన్ని అనుభవించారు. వారు ప్రవర్తన విషయంలో దేవుని ఆదర్శాన్ని చేరలేకపోయారు. ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చలేకపోయారు. “వారు కోరినది ఆయన వారికిచ్చెను. అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను.” వారు ఐహికమైన వాటిని ఆధ్యాత్మిక విషయాల కన్నా విలువగలవిగా ఎంచారు. తమ నిమిత్తం ఆయన ఉద్దేశించిన పరిశుద్ధ ప్రాధాన్యాన్ని వారు సాధించలేకపోయారు. CDTel 387.3