Go to full page →

స్వభావ పరివర్తనకు శాఖాహారం CDTel 387

MS 38, 1898 CDTel 387.4

642. తన ఆజ్ఞలు ఆచరించి తనకు స్వకీయమైన జనంగా నివసించినట్లయితే తమకు ప్రతీ దీవెన కలుగుతుందని ప్రభువు తన ప్రజలకు స్పష్టంగా చెప్పాడు. ఆరోగ్యం విధేయత ఫలమని అరణ్యంలో మో షే నోట ఆయన వారిని హెచ్చరించాడు. శరీరారోగ్యాన్ని ముఖ్యంగా జీర్ణమండల అవయవాల ఆరోగ్యాన్ని మానసిక స్థితి చాలామట్టుకు ప్రభావితం చేస్తుంది. అరణ్యంలో వారికి ప్రభువు సాధారణంగా మాంసాహారం ఇవ్వలేదు. ఎందుకంటే మాంసాహారం వ్యాధిని, అవిధేయతను పుట్టిస్తుందని ఆయనకు తెలుసు. స్వభావం మార్చి ఉన్నత మానసిక శక్తుల్ని క్రియాశీలం చెయ్యటానికి చచ్చిన జంతువుల మాంసాన్ని వారి వద్దనుంచి తొలగించాడు. పరలోకం నుంచి దేవదూతల ఆహారమైన మన్నాని వారికి ఇచ్చాడు. CDTel 387.5