1 కొరి. 10:6,11 CDTel 391.1
645. “వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నవి.” “ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధికలుగుటకై వ్రాయబడెను.” CDTel 391.2
646. బేటిల్ క్రీక్ లోని సంఘం సాధారణంగా తమ ఆదర్శం ద్వారా ఆ సంస్థని బలపర్చటం లేదు. ఆరోగ్య సంస్కరణని తమ కుటుంబాల్లో ఆచరణలో పెట్టకపోటం ద్వారా వారు ఆ వెలుగుని అభినందించటం లేదు. దేవుడిచ్చిన వెలుగుని అనుసరించి ఉంటే, అనేక కుటుంబాల్లో చోటు చేసుకున్న వ్యాధి రావాల్సిన పని ఉండేది కాదు. పూర్వం ఇశ్రాయేలీయుల్లా వారు తమకు వచ్చిన వెలుగుని లెక్కచేయ్యటం లేదు. ఫలితంగా ఇశ్రాయేలీయుల్లా తిండి ఆ పేక్షని నియంత్రించాల్సిన అవసరాన్ని గుర్తించటం లేదు. ఇశ్రాయేలు ప్రజలు మాంసాహారం ఆ పేక్షించారు. నేడు అనేకుల్లా వారు మాంసం లేకుంటే మరణిస్తామన్నారు. తిరుగుబాటు దారులైన ఇశ్రాయేలీయులికి దేవుడు మాంసం ఇచ్చాడు గాని దానితో ఆయన శాపం కూడా ఉంది. తాము వాంఛించిన మాంసం ఇంకా తమ పండ్ల మధ్య ఉండగానే వేలమంది మరణించారు. ప్రాచీన ఇశ్రాయేలీయుల • సాదృశ్యం వారు వ్యవహరించినట్లు వ్యవహరించకూడదన్న హెచ్చరిక మనకున్నది. దేవుని న్యాయ విధుల ఆచరణ గురించి గొణుగుకోటంలో వారి మాదిరిని మనం అవలంబించ కూడదంటూ హెచ్చరిస్తూ, వారి అపనమ్మకపు, తిరుగుబాటు, చరిత్ర దాఖలయ్యింది. హెబ్రీయులు వ్యవహరించినట్లు మన సొంత మార్గాలు ఎన్నుకుని, మన కంటి చూపునే అనుసరిస్తూ, దేవున్ని విడిచి పెట్టి దూరంగా, నిర్లక్ష్యంగా మనం ఎలా వెళ్లిపోగలం? తన ప్రజల హృదయ కాఠిన్యం వల్ల, అవిశ్వాస పాపం వల్ల దేవుడు వారి నిమిత్తం గొప్ప కార్యాలు చెయ్యలేపోతున్నాడు. CDTel 391.3
దేవుడు పక్షపాతి కాడు. కాని ప్రతీ తరంలో తనకు భయపడి, నీతి కోసం పాటుపడే వారిని ఆయన అంగీకరిస్తాడు. సత్యాన్ని ప్రేమించి, దానిననుసరించి నివసించేవారికి ఆయన వాగ్దానం చేసిన అనుగ్రహాన్ని గాని దీవెనల్ని గాని సణిగేవారు, అపనమ్మకం వెలిబుచ్చేవారు, తిరుగుబాటు చేసేవారు పొందరు. వెలుగుండి దాన్ని అనుసరించకుండా ఉంటూ ఆయన ధర్మవిధుల్ని నిర్లక్ష్యం చేసేవారు, తమ దీవెనలు శాపాలుగాను, తమ కృపలు శిక్షలుగాను మారినట్లు కనుగొంటారు. దేవునికి ప్రతిష్ఠిత, స్వకీయ జనమైనప్పటికీ తమ సొంత మార్గాల్ని అనుసరించి తమను తాము నాశనం చేసుకున్న ప్రాచీన ఇశ్రాయేలు చరిత్ర చదివేటప్పుడు మనం నమ్రతని విధేయతని నేర్చుకోవాలని దేవుడు కోరుతున్నాడు. CDTel 392.1
(1900) 6T 372 CDTel 392.2
647. ఆహార పానాలకి సంబంధించిన మన అలవాట్లు మనం లోక సంబంధులమో లేదా సత్యమనే ఖడ్గంతో లోకంనుంచి దేవుడు వేరుచేసిన వారమో చూపిస్తాయి. వీరు సత్కియల యందు ఆసక్తిగల ఆయన ప్రతిష్టిత ప్రజలు. తన వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దానియేలు అతడి ముగ్గురు మిత్రుల విషయంలో ఆరోగ్య సంస్కరణ పై ప్రసంగాలున్నాయి. ఇశ్రాయేలు ప్రజల చరిత్రలో దేవుడు మాట్లాడుతున్నాడు. వారి మేలుకోరి వారికి ఆయన మాంసాన్ని అనుమతించలేదు. పరలోకం నుంచి వచ్చిన ఆహారంతో వారిని పోషించాడు. “మానవుడు దేవదూతల ఆహారం తిన్నాడు.” అయితే వారు తమ ఐహిక ఆహారాన్ని ప్రోత్సహించారు. ఐగుప్తు మాంసాహారం పై వారు ఎంత ఎక్కువ దృష్టి పెడితే తమని శారీరకంగా, మానసికంగా, నైతికంగా, ఆరోగ్యంగా ఉంచటానికి దేవుడిచ్చిన ఆహారాన్ని వారు అంత ఎక్కువగా ద్వేషించారు. వారు ఐగుప్తు మాంసాహారాన్ని ఆ పేక్షించారు. ఇందులో నేడు అనేకులు ఏమిచేస్తున్నారో అదే వారు చేశారు. CDTel 392.3
జల ప్రళయ పూర్య ప్రజలు, ఇశ్రాయేలీయులు మాంసం వాడకంపై అదనపు వచనాలు-231,233] CDTel 393.1