[C.T.B.H.119] (1890) C.H.450 CDTel 393.2
648. మానవుడు భూమి సహజ ఉత్పత్తులు తిని నివసించాలన్న ఆది ప్రణాళికకి క్రమక్రమంగా మనల్ని నడిపించటానికి దేవుడు ప్రయత్నిస్తున్నాడని నాకు పదేపదే చూపించటం జరిగింది. CDTel 393.3
MS 115, 1903 CDTel 393.4
649. మన ఆహారం కూరగాయలు, పండ్లు, గింజలతో తయారుచేసుకోవాలి. ఓ ఔన్స్ మాంసం కూడా మన కడుపుల్లోకి ప్రవేశించకూడదు. మాంసాహారం అస్వాభావికం. మానవుణ్ని సృజించటంలో దేవుని ఆది ఉద్దేశం ఏమిటో దానికి మనం తిరిగి వెళ్లాల్సి ఉంది. CDTel 393.5
(1905) M.H.317 CDTel 393.6
650. అందరు మాంసపదార్థాల్ని విడిచి పెట్టటానికి సమయం కాలేదా? దేవదూతల సహవాసం కలిగి ఉండేందుకు, పవిత్రులు, సంస్కారం గలవారు, పరిశుద్ధులు అవ్వటానికి కృషి చేసేవారు ఆత్మకు శరీరానికి హాని చేసేదాన్ని తమ ఆహారంగా ఎలా తీసుకోగలరు? వాటి మాంసాన్ని విలాస ఆహారంగా తీసుకునేందుకు దేవుడు సృజించిన ప్రాణుల్ని ఎలా చంపగలరు? ఆదిలో దేవుడిచ్చిన ఆరోగ్యదాయకమైన, రుచిగల ఆహారానికి వారు తిరిగి రావాలి. తిరిగివచ్చి, దాన్ని ఆచరిస్తూ, దేవుడు సృష్టించిన తమబిడ్డలకి కరుణను నేర్పించాలి. CDTel 393.7