Go to full page →

మాంసాహార శారీరక ఫలితాలు వ్యాధి, ఆకస్మిక మరణాల్ని అధికం చేస్తాయి CDTel 400

(1868) 2T 64 CDTel 400.2

668. మాంసాహారం వ్యాధికి లోనయ్యే అవకాశాల్ని పదంతలు పెంచుతుంది. CDTel 400.3

ఉత్తరం 83, 1901 CDTel 400.4

669. మానవ కుటుంబంలో వేగంగా పెరుగుతున్న వ్యాధికి ఐహిక వైద్యులు హేతువు కనుక్కోలేరు. కాని వ్యాధి బాధలకి చాలామట్టుకు మాంసాహారం కారణమని మనకు తెలుసు. CDTel 400.5

(1896) E. from U. T. 8 CDTel 400.6

670. పశువులు వ్యాధి కలవి. వాటి మాంసం తినటం ద్వారా మన కణాల్లోను రక్తంలోను వ్యాధి అంకురాల్ని నాటుకుంటాం. అప్పుడు వ్యాధి పూరిత వాతావరణ మార్పులకు లోనైనప్పుడు వీటి బారిని పడుతుంటాం. ఇంకా అంటు వ్యాధులు, సాంక్రామిక వ్యాధులకి గురి అయినప్పుడు వ్యాధిని ప్రతిఘటించటానికి శరీర వ్యవస్థ సమర్థమైన స్థితిలో ఉండదు. CDTel 400.7

(1868) 2T 61 CDTel 400.8

671. మీకు కండ ఉంది. కాని అది మంచి పదార్థంతో నిర్మిత మయ్యింది కాదు. ఇంత కండ ఉండటం మీకు నష్టమే. మీ ఇద్దరూ చెరి పాతిక లేదా ముప్పయి పౌనులు తగ్గేటట్లు ఇంకా తక్కువ ఆహరం తీసుకుంటే, మీరు వ్యాధి బారిన పడే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. మాంసాహారం నాసిరకం రక్తం నాసిరకం మాంసం తయారుచేసింది. మీ శరీర వ్యవస్తలు వేడెక్కి వ్యాధికి లొంగే స్థితిలో ఉన్నాయి. వ్యాధి మీపై తీవ్రంగా దాడిచేసి ఆకస్మిక మరణం కలిగించవచ్చు. ఎందుచేతనంటే వ్యాధిని ప్రతిఘటించటానికి సంఘటిత మవ్వటానికి మీ తత్వంలో శక్తి లేదు. మీకున్నవని మీరు చెప్పుకుంటున్న బలం, ఆరోగ్యం మీ బలహీనతగా నిరూపితం కానున్న సమయం వస్తుంది. CDTel 400.9