Go to full page →

వ్యాధిగ్రస్తమైన రక్తం CDTel 401

(1896) E. from U. T. 4 CDTel 401.1

672. తమ బాధ, తమ అనారోగ్యం , ఆరోగ్యసంస్కరణపై తమకు దేవుడిచ్చిన వెలుగుని అలక్ష్యం చేసినందువల్ల సంభవిస్తున్నాయన్న విషయం అనేకుల ముందు పెట్టవలసిందిగా దేవుని ఆత్మ నన్ను ఆదేశించినట్లు గుర్తిస్తున్నాను. తాము అత్యవసరమని భావిస్తున్న మాంసాహారం అవసరం లేదని, తాము తినే ఆహారాన్ని బట్టే తమ నిర్మితి జరుగుతుందని, తమ మెదడు, ఎముకలు, కండరాలు అనారోగ్యస్థితిలో ఉండటానికి తాము చచ్చిన పశువుల మాంసం తినటం కారణమని, తాము తింటున్న అనుచిత ఆహారం తమ రక్తాన్ని చెడగొడుందని, తాము తిన్న మాంసం వ్యాధిగ్రస్తమైనందువల్ల తమ శరీర వ్యవస్థ మొత్తం స్థూలమై రుజాగ్రస్తమౌతున్నదని వారికి చూపించాను. CDTel 401.2

(1870) 2T 368 CDTel 401.3

673. మాంస పదార్థాలు రక్తం వాసిని తగ్గిస్తాయి. మాంసాన్ని మసాలాలతో వండి, కేకులతోను, పయిలతోను తినండి. ఫలితంగా మీ రక్తం నాణ్యత చెడిపోతుంది. ఇలాంటి ఆహారాన్ని జీర్ణించుకోటానికి శరీర వ్యవస్థ ఎక్కువ శ్రమపడాల్సి వస్తుంది. మానవుడి కడుపులో ప్రవేశించకూడని కయిమా పయిలు, పచ్చళ్లు ఉత్పత్తి చేసే రక్తం చాలా తక్కువ నాణ్యత గలది. అనుచితరీతిగా వండిన, తక్కువ రకం అరకొరగా ఉన్న ఆహారం మంచి రక్తాన్ని ఉత్పత్తి చెయ్యలేదు. మాంసపదార్థాలు, విలాసవంతమైన ఆహారం, పోషకపదార్ధాలు లేని ఆహారం ఇవే ఫలితాల్ని ఇస్తాయి. CDTel 401.4

(1896) E. from U. T.7 CDTel 402.1

674. క్యాన్సర్లు, కంతులు, తాపం పుట్టించే వ్యాధులు ఎక్కువ భాగం మాంసాహారం వల్ల సంభవిస్తున్నాయి. CDTel 402.2

దేవుడు నాకిచ్చిన వెలుగు ప్రకారం క్యాన్సర్లు, కంతులు చాలా మట్టుకు చచ్చిన జంతువుల మాంసం తినటం వల్ల సంభవిస్తున్నాయి. CDTel 402.3