[C.T.B.H.41,42] (1890) C.H.107, 108 CDTel 3.2
2. క్రీస్తును అనుగ్రహించటం ద్వారా తాను సాధ్యపర్చిన ప్రమాణాన్ని మనం చేరాల్సిందిగా దేవుడు కోరుతున్నాడు. మనం పరలోక సంబంధమైన సాధనాలతో అనుసంధాన పడటానికి, మనలో దైవ స్వరూపాన్ని పునరుద్ధరించే నియమాల్ని అనుసరించటానికి మనం న్యాయమైన పక్షాన్ని ఎంపిక చేసుకోవలసిందిగా ఆయన మనకు పిలుపునిస్తున్నాడు. జీవిత నియమ నిబంధనల్ని తన లిఖిత వాక్యంలోను, ప్రకృతి గ్రంథంలోను ఆయన ఇచ్చాడు. ఈ నియమ నిబంధనలు ఏమిటో తెలుసుకోటం, శరీరాత్మల ఆరోగ్యాన్ని పునరుద్ధరించటంలో వాటికి విధేయులమై, ఆయనతో సహకరించటం మన కర్తవ్యం. CDTel 3.3
ఉత్తరం 73 బి, 1896 CDTel 3.4
3. ప్రతీప్రాణీ దేవుని సొత్తు. సృష్టి మూలంగాను విమోచన మూలంగాను అది ఆయనది. మన శక్తుల్లో మనం దేన్ని దుర్వినియోగం చేసినా దేవునికి చెందాల్సిన ఘనతను దోచుకుంటున్న వారమౌతాం. CDTel 3.5