Go to full page →

విధేయతకు సంబంధించిన విషయం CDTel 4

MS 49, 1897 CDTel 4.1

4. మన శరీరాన్ని పరిశుభ్రంగా, శుద్ధంగా, ఆరోగ్యవంతంగా దేవునికి సమర్పించ బాధ్యులమై ఉన్నామన్న విషయమై మనకు అవగాహన లేదు. CDTel 4.2

ఉత్తరం 120,1901 CDTel 4.3

5. జీవన యంత్రాంగం తాలూకు శ్రద్ధ విషయంలో వైఫల్యం సృష్టికర్తకు పరాభవం. దేవుడు నియమించిన నియమాలున్నాయి. వాటిని ఆచరణలో పెడితే అవి వ్యాధి, అకాల మరణాలనుంచి మానవుల్ని కాపాడతాయి. CDTel 4.4

R.& H., మే 8,1883 CDTel 4.5

6. దేవుని ఆశీర్వాదాల్ని మనం మరెక్కువగా అనుభవించకపోటానికి కారణం జీవితం ఆరోగ్యం విషయంలో ఆయన మనకు అనుగ్రహించిన నియమ నిబంధనల్ని మనం పాటించకపోవటమే. CDTel 4.6

(1900) C.O.L. 347, 348 CDTel 4.7

7. నీతి, ధర్మశాస్త్రాల వాస్తవిక కర్త అయినట్లే శారీరక ధర్మశాస్త్ర వాస్తవిక కర్త దేవుడే. ప్రతీ నరం మీద, ప్రతీ కండరం మీద, ప్రతీ మానసిక శక్తి మీద తన ధర్మశాస్త్రాన్ని, తన సొంత వేలితో ఆయన రాసి మానవుడికి అప్పగించాడు. CDTel 4.8

8. మానవుణ్ని సృజించిన దేవుడు మన దేహాల జీవ యత్రాంగాన్ని ఏర్పాటు చేశాడు. ప్రతీ విధిని అద్భుతంగా జ్ఞానయుక్తంగా రూపొందించాడు. మానవుడు తన చట్టాలికి విధేయుడై తనతో సహకరిస్తే మానవ శరీర యంత్రాంగాన్ని ఆరోగ్యవంతంగా పనిచేసే స్థితిలో ఉంచుతానని దేవుడు వాగ్దానం చేశాడు. మానవ శరీర యంత్రాంగాన్ని పనిచెయ్యించే ప్రతీ నియమం ఆయన వాక్యంవలె స్వభావంలోను, ప్రాముఖ్యతలోను దైవసంబంధమైంది. ఆయన మూలంగా కలిగింది. మానవ దేహంలోని దేవుని నిర్దిష్ట చట్టాల్ని అలక్ష్యం చెయ్యటం ద్వారా చోటుచేసుకునే ప్రతీ ఉదాసీన, అజాగరూక క్రియా, దేవుని అద్భుత యంత్రాంగానికి సంభవించే ప్రతీ హానీ దేవుని ధర్మశాస్త్ర ఉల్లంఘన అవుతుంది. ప్రకృతిలో దేవుని పనిని చూసి మనం ఆశ్యర్యపడవచ్చు. అయితే మానవ దేహం మరింత అద్భుతమైంది. CDTel 4.9

[శక్తిని అనవసరంగా వ్యయపర్చి, మస్తిష్కాన్ని మసకబార్చే అధ్యయనాన్ని చేపట్టటం అనే పాపం-194] CDTel 5.1

(1890) C.T.B.H.53 CDTel 5.2

9. పది ఆజ్ఞల్ని అతిక్రమించటం ఎలా పాపమో మన శరీరానికి సంబంధించిన నియమాన్ని అతిక్రమించటం అలాగే పాపం. ఈ రెండింటిలో దేన్ని అతిక్రమించినా దైవధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించట మౌతుంది. తమ శరీర అంగ క్రమ నిర్మాణ నియమాన్ని అతిక్రమించేవారు, సీనాయి పర్వతం పై నుంచి దేవుడు ప్రకటించిన ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించటానికి ముచ్చటపడతారు. CDTel 5.3

[63 కూడా చూడండి] CDTel 5.4

జలప్రళయానికి ముందు లోకంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అలాంటి పరిస్థితులే తన రాకకు ముందు ప్రపంచంలో ప్రబలుతాయని మన రక్షకుడు తన శిష్యుల్ని హెచ్చరించాడు. అమితంగా తినటం, తాగటం జరుగుతుంది. లోకం వినోదాల్లో మునిగితేలుతుంది. ఈ పరిస్థితి ప్రస్తుత కాలంలో కనిపిస్తుంది. ప్రపంచం చాలా మట్టుకు తిని, తాగటంలో తలమునకలై ఉంది. లోకాచారాన్ని అనుసరించే తత్వం మనల్ని వంకర బుద్దులకి, అభ్యాసాలికి బానిసల్ని చేస్తుంది. ఆ అలవాట్లు అభ్యాసాలు నాశనమైన సొదొమ నివాసుల్లా మనల్ని తీర్చిదిద్దుతాయి. ఇప్పటి ప్రజలు సొదొమ గొమోర్రా ప్రజలవలె నాశనం కాకపోటం ఆశ్యర్యంగా ఉంది. లోకంలోని ప్రస్తుత క్షీణతకు మరణానికి చాలినంత హేతువు కనిపిస్తుంది. స్వస్త బుద్ధిని గుడ్డి ఉద్వేగం అదుపు చేస్తుంది. అనేకుల విషయంలో ఉన్నత పరిగణన మోహానికి బలి అవుతుంది. CDTel 5.5

శరీర యంత్రాంగంలోని భాగాలన్నీ సక్రమంగా పనిచేసేందుకు శరీరాన్ని మంచి ఆరోగ్యస్థితిలో ఉంచుకోటం జీవితంలో మన అధ్యయనం కావాలి. దైవ ప్రజలు వ్యాధిగ్రస్తమైన శరీరాలు, సంకుచిత మనసులతో దేవున్ని మహిమ పర్చలేరు. తినటంలోనేగాని తాగటంలోనేగాని మితాన్ని పాటించనివారు తమ భౌతిక శక్తుల్ని వ్యర్థపుచ్చి నైతిక శక్తిని బలహీన పర్చుతారు. CDTel 5.6

(1900) 6T 369,.370 CDTel 6.1

10. ప్రకృతి చట్టాలు దేవుని చట్టాలు గనుక ఈ చట్టాల్ని శ్రద్ధగా అధ్యయనం చెయ్యటం మన విధి. మన శరీరాల విషయంలో అవి నిర్దేశించే విధుల్ని మనం అధ్యయనంచేసి ఆచరించాలి. ఈ విషయాల్లో అజ్ఞానం పాపం. [ఇష్టపూర్వక అజ్ఞానం పాపాన్ని వృద్ధి చేస్తుంది-53] CDTel 6.2

“మీ దేహములు క్రీస్తునకు అవయవములైయున్నవని మీరెరుగరా?” “మీదేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్యకు ఆలయమైయున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తుకారు. విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి”. 1 కొరింథీ 6:15,19,20. మన దేహాలు క్రీస్తు కొనుక్కొన్న ఆస్తి. వాటిని మన ఇష్టం వచ్చినట్లు ఉపయోగించటానికి మనకు హక్కు లేదు. మానవుడు ఈ పనే చేస్తున్నాడు. చట్టాలకు శిక్షావిధి లేదన్నట్లు అతడు తన దేహంతో వ్యవహరిస్తున్నాడు. వక్రమైన ఆహారపు అలవాట్లవల్ల అవయవాలు శక్తులు వ్యాధిగ్రస్తమై కుంటుబడుతున్నాయి. తన బోధనల ద్వారా తాను కలిగించిన ఈ పర్యవసానాల్ని ఎత్తి చూపిస్తూ సాతాను దేవున్ని వెక్కిరిస్తున్నాడు. క్రీస్తు తన ఆస్తిగా కొన్న మానవ దేహాన్ని అతడు దేవుని ముందు పెడుతున్నాడు. మనుషుడు తన సృష్టికర్త ముందు ఎంత అప్రియమైన సమర్పణగా ఉన్నాడు! మానవుడు తన దేహం విషయంలో పాపం చేసి తన మార్గాన్ని భ్రష్టపర్చుకున్నాడు గనుక దేవునికి అగౌరవం కలుగుతున్నది. CDTel 6.3

మనుషుల్లో నిజమైన మారుమనసు చోటు చేసుకున్నప్పుడు తమ దేహాల్లో దేవుడు ఏర్పాటు చేసిన చట్టాల్ని తమకు తెలియకుండానే స్వాభావికంగా ఆచరిస్తూ, తద్వారా శారీరక, మానసిక, నైతిక బలహీనతను నివారించుకోటానికి వారు కృషి చేస్తారు. ఈ చట్టాలకు విధేయంగా నివసించటం మన వ్యక్తిగత విధిగా పరిగణించాలి. చట్ట ఉల్లంఘన పర్యవసానాల్ని మనమే భరించాలి. మన అలవాట్లు అభ్యాసాల నిమిత్తం మనం దేవునికి జవాబుదారులం. కాబట్టి “లోకం ఏమంటుంది? అన్నది కాదు. క్రైస్తవుడిగా చెప్పుకుంటున్న నేను దేవుడు నాకిచ్చిన నివాసాన్ని (శరీరాన్ని) ఎలా చూసుకుంటున్నాను? నాదేహాన్ని పరిశుద్ధాత్మ నివాసంగా ఉంచుకోటం ద్వారా ఉన్నత లౌకిక ఆధ్యాత్మిక ప్రయోజనాలకోసం కృషి చెయ్యనా? లేదా లోక సంబంధమైన అభిప్రాయాలు అభ్యాసాల నిమిత్తం నన్ను నేను బలి చేసుకోనా?” అన్నవి మనకు మనం వేసుకోవలసిన ప్రశ్నలు. CDTel 6.4