Go to full page →

జంతువుల కొవ్వు రక్తం CDTel 408

(1868) 2T 61 CDTel 408.4

696. ఓ కుటుంబంగా మీరు వ్యాధికి ఎక్కువ దూరంలో లేరు. “మీరు కొవ్వునైనను, రక్తమునైననూ తినకూడదు. అది తరతరములకు మీ నివాసస్థలములన్నింటిలోను నిత్యమైన కట్టడ” అంటూ దేవుడు తన వాక్యంలో నిషేధించిన జంతుకొవ్వుని మీరు ఉపయోగిస్తున్నారు. “మరియు పక్షిదే గాని జంతువుదే గాని ఏ రక్తమును మీ నివాసములన్నింటిలోను తినకూడదు. ఎవడు రక్తము తినునో వాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును.” CDTel 408.5

ఉత్తరం 102, 1896 CDTel 408.6

697. మాంసాన్ని కొవ్వుతో వడ్డిస్తారు. ఎందుకంటే అది వర్ష రుచికి కమ్మగా ఉంటుంది. జంతు రక్తం, కొవ్వు రెండూ విలాస వంటకంగా తింటారు. కానీ వీటిని తినకూడదని ప్రభువు ప్రత్యేక ఆదేశం ఇచ్చాడు. ఎందుకు? ఎందుకంటే వాటి వాడకం మానవ శరీర వ్యవస్థలో వ్యాధిగ్రస్తమైన రక్తం ప్రవహింపజేస్తుంది. ప్రభువు ఇచ్చిన ప్రత్యేక ఆదేశాల నిర్లక్ష్యం మానవుల మీదికి రకరకాల సమస్యల్ని వ్యాధుల్ని తెస్తుంది.... ఏది మంచి మాంసం, మంచి రక్తం ఉత్పత్తి చెయ్యలేదో దాన్ని వ్యవస్థలోకి ప్రవేశ పెట్రీ దైవ వాక్యాన్ని అలక్ష్య పెడున్న పర్యవసానాల్ని భరించాలి. CDTel 408.7