Go to full page →

తరచుగా కలుషితమైన చేపలు CDTel 409

(1905) M.H.314,315 CDTel 409.1

698. అనేక స్థలాల్లో చేపలు అవి తినే మురికి కారణంగా కలుషితమై వ్యాధికి కారణమౌతాయి. ముఖ్యంగా పెద్దనగరాల మురుగుతో చేపలకి సంబంధం ఉన్నచోట ఇది సంభవిస్తుంది. మురుగుకాల్వల్లో పెరిగే చేపలు ప్రవాహంలో దూరంగా వెళ్లి శుభ్రంగా, తాజాగా ఉన్న నీటిలో పట్టుబడవచ్చు. భోజనంలో ఉపయోగించినప్పుడు ప్రమాదాన్ని గుర్తించని వారికి వ్యాధిని మరణాన్ని ఈ రకంగా తెస్తాయి. CDTel 409.2