Go to full page →

ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చెయ్యండి CDTel 413

(1905) M. H.516,517 CDTel 413.3

708. మాంసం తినటం మానేసినప్పుడు, దాని స్థానే పోషక పదార్థాలు రుచిగల వివిధ గింజలు, పప్పులు, కూరగాయలు, పండ్లు తినాలి. బలహీనులు, నిత్యం కష్టపడి పనిచేసేవారి విషయంలో ఇది మరీ ముఖ్యం పేదరికం ఉన్న కొన్ని దేశాల్లో మాంసమే మిక్కిలి చౌకైన ఆహారం. ఈ పరిస్థితుల్లో మార్పు కష్టమౌతుంది. అయినా మార్పు చెయ్యవచ్చు. ప్రజల పరిస్థితుల్ని, జీవితకాలమంతా ఉన్న అలవాటుని పరిగణలోకి తీసుకుని, సరియైన అభిప్రాయాల్ని సయితం అనుసరించాలని కోరటంలో మనం జాగ్రత్త వహించాలి. ఆకస్మికమైన మార్చుకి ఎవర్నీ ప్రోత్సహించ కూడదు. మాంసం బదులు ఆరోగ్యవంతమైన, చౌకైన ఆహార పదార్థాల్ని తీసుకోవాలి. ఈ విషయంలో వంటచేసే వ్యక్తిమీద చాలా ఆధారపడి ఉంటుంది. శ్రద్ధ, నిపుణతలతో ఆరోగ్యదాయకంగాను, రుచిగాను వంటకాలు చెయ్యవచ్చు. అది చాలా మట్టుకు మాంసం స్థానాన్ని తీసుకుంటుంది. CDTel 413.4

అన్ని సందర్భాల్లోను మనస్సాక్షిని చైతన్యపర్చండి. చిత్తాన్ని సమ్మతింప చెయ్యండి, ఆరోగ్యదాయకమైన ఆహారం సరఫరా చెయ్యండి. అప్పుడు మాంసం కావాలని కోరటం కొద్దికాలంలో ఆగిపోతుంది. CDTel 413.5

ఉత్తరం 60a, 1896 CDTel 413.6

709. ఆహారం సరిగా వండటం ప్రాముఖ్యమైన సాధన. ఎక్కడ మాంసం ప్రధాన ఆహారపదార్ధం కాదో అక్కడ మంచి వంట ముఖ్యావసరమౌతుంది. మాంసానికి మారుగా ఏదో ప్రత్యామ్నాయాన్ని తయారుచెయ్యాలి. మాంసానికి మారుగా తయారుచేసే ఈ ఆహారపదార్ధాల్ని మాంసాహారాన్ని మరిపించే విధంగా తయారు చెయ్యాలి. CDTel 413.7

[అవగాహన చేసుకునే మార్పులు చెయ్యండి-320,380] CDTel 414.1

[మాంసాహారం విడిచి పెట్టేటప్పుడు సరియైన ఆహారం అవసరం-320] CDTel 414.2

[మాంసాహారం స్థానే ఆరోగ్యదాయక ఆహారం తయారుచెయ్యటానికి దేవుడు నిపుణత నిస్తాడు-376,400,401,404] CDTel 414.3

[పండ్లు, గింజలు, పప్పులు, కూరగాయల ఆహారం మాంసాహారానికి ప్రత్యామ్నాయం -472,483,484,513] CDTel 414.4