Go to full page →

అర్థంలేని సాకులు CDTel 414

(1870) 2T 486,487 CDTel 414.5

710. సాతాను మనసుని వశపర్చుకున్నప్పుడు, ప్రభువు కృపతో అనుగ్రహించిన వెలుగు, ఉపదేశం ఎంత త్వరితంగా మాయమౌతాయి! శక్తిని కోల్పోతాయి! వెలుగుని తోసిపుచ్చి, కాళ్లకిందవేసి తొక్కటంలో తామవలంబిస్తున్న తప్పుడు మార్గంలో కొనసాగటానికి ఎంతమంది సాకులు చెబుతారు! లేని అవసరాలని పేర్కొంటారు! నేను ఖచ్చితంగా మాట్లాడున్నాను. ఈ ప్రజలు ఆరోగ్య సంస్కరణని అనుసరించి నివసించకపోటమే పెద్ద అభ్యంతరం. అయినా ఆరోగ్య సంస్కరణ ప్రకారం నివసిస్తూ తమ బలాన్ని కాపాడుకోలేమని వారు గంభీర స్వరంతో చెబుతారు. CDTel 414.6

ఆరోగ్యసంస్కరణ ప్రకారం వారు ఎందుకు నివసించలేరో అలాంటి ప్రతీ సందర్భంలోను మనకు తెలుస్తుంది. వారు దానిననుసరించి నివసించరు. కచ్చితంగా ఎన్నడూ అనుసరించరు. అందుకే దానివల్ల ఉపకారం పొందరు. తాము మాంసాన్ని విడిచి పెడుతున్నారు గనుక దాని వెలితిని కొవ్వునూనె, మసాలాలు లేకుండా శ్రేష్ఠమైన పండ్లు, కూరగాయల్ని వాటి స్వాభావిక స్థితిలో తయారుచేసి సరఫరా చెయ్యటం అవసరం లేదని భావించే పొరపాటులో కొందరు పడతారు. దేవుడు తమ చుట్టూ సమృద్ధిగా ఉంచిన భూఫలాలన్నింటిని తల్లిదండ్రులు, పిల్లలు చిత్తశుద్ధితో పనిచేస్తూ నిపుణతతో ఏర్పాటు చేసుకుంటే, వారు సామాన్యాహారాన్ని తిని ఆనందిస్తూ ఆరోగ్యసంస్కరణను గురించి మంచి అవగాహనతో మాట్లాడతారు. ఆరోగ్యసంస్కరణ ఆచరణ విషయంలో పరివర్తన లేనివారు దాన్ని ఎన్నడూ పూర్తిగా ఆచరించనివారు దాని ఉపకారాల గురించి తీర్పురులు కారు. తిండి వాంఛను తృప్తిపర్చుకోటానికి అప్పుడప్పుడు కొవ్విన టర్కీని గాని లేక ఇతర మాంసపదార్థాలు గాని సంస్కరణని పక్కన పెట్టి తినేవారు వక్రరుచులు గలవారు. వారు ఆరోగ్య సంస్కరణ వలన ఒనగూడే ఉపకారాల్ని గురించి తీర్పు తీర్చేవారు కారు. వారిని తిండి అదుపు చేస్తుంది. నియమం కాదు. CDTel 414.7