ఉత్తరం 84, 1898 CDTel 430.2
723. నీ ఉత్తరం అందింది. మాంసం గురించి వివరణ ఇవ్వటానికి నా శక్తి కొద్దీ ప్రయత్నిస్తాను. నీవు ప్రస్తావించిన మాటలు — ఉత్తరంలోనివీను సోదరి — ఆరోగ్యాశ్రమంలో ఉన్నప్పుడు ఇతరులవీను. (720) నేను ఈ ఉత్తరాల్ని వెతికించాను. కొన్నింటికి ప్రతులు తీశాం. కొన్నింటికి తీయలేదు. ఈ మాటలు చెప్పిన తారీఖులు ఇవ్వమని వారికి చెప్పాను. అప్పట్లో మాంసాహారం చికిత్సలో భాగంగా ఆదేశించటం దాన్ని ఎక్కువ వినియేగించటం జరిగేది. ఆరోగ్యంగా ఉన్న జంతువుల మాంసాన్ని ఒక్కసారిగా ఆపుచెయ్యకూడదని, కాని చచ్చిన జంతువుల మాంసం ఉపయోగించటం గురించి హాలులో ఉపన్యాసాన్నివ్వాలని, పండ్లు, గింజలు, కూరగాయల్ని సరిగా తయారుచేసుకుంటే అవి మన శరీరానికి అవసరమైన ఆరోగ్యాన్ని సమకూర్చుతాయని; అయితే కాలిఫోర్నియాలో లాగ విస్తారంగా పండ్లు లభించే చోట మాంసం వాడకం అవసరం లేదని ముందువారికి చూపించాలని నాకు వచ్చిన వెలుగు చెబుతున్నది. కాని ఆరోగ్యాశ్రమంలో మాంసాన్ని విచ్చలవిడిగా వాడిన తర్వాత హఠాత్తుగా మార్పుచెయ్యటానికి వారు పూనుకోలేరు. వారు మొదట కొంచెం మాంసాన్నే ఇచ్చి చివరికి దాన్ని పూర్తిగా నిలుపుచెయ్యాలి. మాంసం తినే రోగులకి ఒక బల్ల మాత్రమే ఉండాలి. తక్కిన బల్లలపై ఈ వంటకం అసలు ఉండకూడదు....మాంసం పూర్తిగా విసర్జించటానికి ప్రజల్ని చైతన్యపర్చటానికి నేను కష్టపడి పనిచేశాను. అయితే ఈ జటిల సమస్యని జాగ్రత్తగా ఎదుర్కోవాలి. మూడు పూటలా మాంసం వినియుక్తమైన తర్వాత ఈ విషయంలో తొందరపాటుతనం పనికిరాదు. ఆరోగ్య దృక్పథం నుంచి రోగుల్ని చైతన్యపర్చాలి. CDTel 430.3
ఆ విషయం పై నాకిదే జ్ఞాపకముంది. మన పరిగణనకు అధికమైన వెలుగు వస్తున్నది. జంతుసృష్టి వ్యాధిగ్రస్తమయ్యింది. మాంసాహారం వల్ల మానవకుటుంబంలో చోటు చేసుకునే వ్యాధి ఇంత అంత అని నిర్ధారణగా చెప్పలేం. మాంసం పై జరిగే తనిఖీని గురించి వార్తాపత్రికల్లో చదువుతాం. జంతువుల్ని వధించే స్థలాల్ని నిత్యం శుభ్రం చేస్తుంటారు. అమ్మటానికి వచ్చే మాంసం తినటానికి యోగ్యం కానిదిగా పలువురు ఖండిస్తున్నారు. CDTel 431.1
ఆరోగ్యపరంగాగాని, నైతికురంగాగాని మాంసం మంచిది కాదని నాకు అనేక సంవత్సరాలుగా వెలుగు వచ్చింది. అయినా ఈ మాంసాహార సమస్యని మళ్లీ మళ్లీ ఎదుర్కోవలసిరావటం విచిత్రం. ఆరోగ్యాశ్రమంలోని వైద్యులతో నేను సన్నిహితంగా, నిర్ణయాత్మకంగా మాట్లాడాను. వారు విషయాన్ని పరిగణించారు. సోదరుడు, సోదరి — ని నిలదియ్యటం జరిగింది. మాంసం రోగుల చికిత్సలో భాగంగా వినియోగించటం జరుగుతున్నది.... ఆస్ట్రేలియన్ యూనియన్ కాన్ఫరెన్స్ లో ఉన్నప్పుడు స్టేన్ మాలో సబ్బాతు ఆచరించాం. స్టీన్ మార్ కి కొన్ని కేంద్రాల దూరంలో ఉన్న సమ్మర్ హిల్ లో ఆరోగ్య కేంద్ర స్థాపనను చేపట్టాల్సిందిగా ప్రభువు ఆత్మ నన్ను ప్రేరేపించాడు. CDTel 431.2
ఈ సేనిటేరియమ్ వల్ల కలిగే ఉపకారాల్ని నేను సమర్పించాను. మాంసాన్ని భోజనబల్లలపై పెట్టకూడదని చచ్చిన జంతువుల మాంసాన్ని తినడానికి సమర్పించటం ద్వారా వేల ప్రజల జీవితాలు బలిఔతున్నాయని చూపించాను. అంత నిర్ణయాత్మకంగా నేనెన్నడు విజ్ఞప్తి చెయ్యలేదు. చచ్చిన జంతువుల మాంసం రోగులకి ఇవ్వని సంస్థ మనకున్నందుకు కృతజ్ఞురాలిని అన్నాను. వైద్యులకి గాని, నిర్వాహకులకి గాని, సహాయకులకి గాని, లేక రోగులకిగాని ఒక్క మాంసం ముక్క కూడా వడ్డించలేదని చెప్పుదురుగాక. ఈ సమస్యని మన వైద్యులు ఆరోగ్య కోణం నుంచి పరిగణిస్తారని, చచ్చిన జంతువుల మాంసం క్రైస్తవుడి ఆహారంలో భాగం కాకూడదని నిశ్చయించుకుంటారని నేను విశ్వసిస్తున్నాను. CDTel 432.1
ఈ విషయాన్ని కాస్తకూడా నేను మెరుగు దిద్దలేదు. మన ఆరోగ్య ఆశ్రమంలోని వారు చచ్చిన జంతువుల మాంసాన్ని భోజనబల్లమీద పెడితే, వారు దేవుని ఆలయాన్ని అపవిత్రం చేస్తారు. దేవుని ఆలయాన్ని ఎవరు అపవిత్రం చేస్తారో వారిని దేవుడు నాశనం చేస్తాడు అన్న మాటలు వారికి అవసరం. నాకు వచ్చిన వెలుగు చెబుతున్నదేమిటంటే దేవుని శాపం భూమిమీద, సముద్రం మీద, పశువుల మీద, జంతువుల మీద ఉన్నదని. గొర్రె మేకల మందల్లోను, పశువుల మందల్లోను క్షేమం లేని సమయం త్వరలో వస్తున్నది. దేవుని శాపం కింద భూమి క్షీణిస్తున్నది. CDTel 432.2