Go to full page →

మన నియమాల్ని నమ్మకంగా ఆచరిస్తూ నివసించటం CDTel 432

724. నివారించలేని కొన్ని పరిస్థితుల వల్ల ఇటీవలి కాలంలో సేనిటేరియమ్ లోని రోగుల సంఖ్య తగ్గింది. దానికి కారణం సంస్థ అధికారులు రోగులకి మాంసం ఇవ్వటానికి వ్యతిరేకంగా తీసుకున్న చర్యే. సేనిటేరియమ్ ప్రారంభమైనప్పటినుంచి భోజనశాలలో మాంసం వడ్డించటం జరుగుతూ వచ్చింది. మాంసాహారానికి వ్యతిరేకంగా ఖచ్చితమైన చర్య తీసుకోటానికి సమయం వచ్చిందని మేము భావించాం. రోగుల ముందు మాంసం పెట్టటం దేవునికి సమ్మతం కాదని మాకు తెలుసు. CDTel 432.3

ఇప్పుడు సేనిటేరియమ్ లో టీ కాఫీ లేక మాంసం సరఫరా చెయ్యటం లేదు. ఆరోగ్యసంస్కరణ నియమాల ప్రకారం నివసించటానికి, సత్యం నీతి మార్గంలో నడవటానికి మేము కృతనిశ్చయులమయ్యాం . పోషణను పోగొట్టుకుంటామన్న భయం లేకుండా సగం అటు సగం ఇటు ఉండ కూడదని సంస్కర్తలుగా ఓ తీర్మానం తీసుకున్నాం. దేవుని సహాయంతో దానికి నిలబడి ఉంటాం. రోగులకి ఇచ్చే ఆహారం ఆరోగ్యకరమైన కమ్మని ఆహారం. అది పండ్లు, గింజలు, పప్పులతో కూడిన ఆహారం. ఇక్కడ కాలిఫోర్నియాలో అన్ని రకాల పండ్లు సమృద్ధిగా దొరుకుతాయి. CDTel 433.1

మాంసాహారులైన రోగులు వచ్చి మాంసం తినకుండా ఉండలేమని భావిస్తే ఆ విషయాన్ని వారు సుబుద్ధితో పరిగణించేటట్లు చేస్తాం. వారు దీనికి సమ్మతించకపోతే, ఆరోగ్యాన్ని నాశనం చేసేదాన్ని ఉపయోగించటానికి తీర్మానించుకుంటే, వారు తమ గదుల్లో తినటానికి దాని పర్యవసానాన్ని అనుభవించటానికి సమ్మతంగా ఉంటే, వారికి మాంసం ఇవ్వటం నిరాకరించం. కాని వారు తమ చర్యకు బాధ్యత వహించాలి. వారి చర్యకు మేము సమ్మతించం. రక్తాన్ని కలుషితం చేసి వ్యాధిని కలిగించేసి చర్యకు సమ్మతించటం ద్వారా దైవ గృహనిర్వాహకత్వాన్ని అగౌరవపర్చలేం. ఆయన సమ్మతించడని తెలిసిన పనిని చేసినట్లయితే మా ప్రభువుకి అపనమ్మకమైన సేవకులమవుతాం. CDTel 433.2

మేము చేసుకున్న తీర్మానం ఇది. ఆరోగ్య నియమాలకి నమ్మకంగా నిలబడతాం. దేవుడు మాకు సహాయం చేయును గాక అన్నది నా ప్రార్థన. CDTel 433.3

సంస్థ పోషణలో వృద్ధి సాధించటానికి ప్రణాళికల్ని అమలు పర్చాలి. అయితే ఎక్కువ మంది రోగుల్ని రాబట్టటానికి మాంసాహారం ఇవ్వటానికి తిరిగి వెళ్లటం న్యాయమా? తమకు వ్యాధి కలిగించిన దాన్ని ఆహారంగా ఉపయోగించటం కొనసాగిస్తే తమను వ్యాధిగ్రస్తులుగా ఉంచేది రోగులకిద్దామా? ఆరోగ్య సంస్కరణ నియమాల్ని పాటించటానికి కృతనిశ్చయులైనవారిలా మనం స్థిరంగా నిలబడవద్దా? CDTel 433.4

[టీ, కాఫీ, మాంసం రోగుల గదుల్లో-437] CDTel 433.5

MS73, 1908 CDTel 434.1

725. ఆరోగ్యసంస్కరణ నియమాల్ని నమ్ముతున్నట్లు చెప్పుతూ మాంసపదార్థాలు ఆరోగ్యానికి హానిచేసే ఇతర ఆహారపదార్థాలు తీసుకునేవారు కొందరున్నారు. అలాంటి వారికి ప్రభువు నామంలో నేను చెప్పేదేమిటంటే, మన సంస్థలు ఏ నియమాల పై స్థాపితమయ్యాయో వాటిని ఆచరించటానికి మీరు నిరాకరిస్తుండగా ఆ సంస్థల్లో ఉద్యోగాల్ని అంగీకరించకండి అని. ఎందుకంటే సరిఅయిన విధంగా పనిని నిర్వహించటానికి పాటుపడే ఉపాధ్యాయులు నాయకుల కృషిని మీరు ఇలా చెయ్యటం ద్వారా రెండు రెట్లు కఠినం చేస్తున్నారు. రాజు మార్గాన్ని సుగమం చెయ్యండి. ఆయన పంపుతున్న వర్తమానాన్ని అడ్డుకోటం మానండి. CDTel 434.2

మన వర్తమానం తొలినాళ్లలో దేవుడు మనకిచ్చిన నియమాల్ని అప్పుడెంత ప్రాముఖ్యంగా పరిగణించామో ఇప్పుడూ అంతే ప్రాముఖ్యంగా పరిగణించాలని దేవుడు నాకు కనపర్చాడు. ఆహారంపై దేవుడు మనకిచ్చిన వెలుగుని ఎన్నడూ అనుసరించనివారు కొందరున్నారు. వెలుగుని కుంచం కిందనుంచి బయటికి తీసి స్పష్టమైన, కాంతివంతమైన కిరణాలతో ప్రకాశింపజెయ్యాల్సిన సమయం ఇదే. CDTel 434.3

[మన సేనిటేరియమ్ ఇవ్వకూడదు-424,431,432] CDTel 434.4

[సహాయకులికి వంచకూడదు-432,444] CDTel 434.5

[తియ్యటి ఆహారపదార్థాలు వ్యాధిలేని మాంసమెంత హానికరమో అంత హానికరం-533,556,722] CDTel 434.6