Go to full page →

జబ్బుగా ఉన్నప్పుడు నీటి వినియోగం CDTel 436

ఉత్తరం 35, 1890 CDTel 436.5

728. బాధనివారణకి నీటిని అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చు. భోజనానికి ముందు సుమారు సగం క్వార్ట్ స్వచ్చమైన వేడినీరు తీసుకుంటే మేలేగాని కీడు జరగదు. CDTel 436.6

(1866) H. TO L., అధ్యా.4, పుట56 CDTel 436.7

729. స్వచ్ఛమైన నీరు గాలి లేనందువల్ల బతికి ఉండాల్సిన వేల ప్రజలు మరణిస్తున్నారు.... ఆరోగ్యంగా ఉండటానికి ఇవి అవసరం. వారు విజ్ఞులై, మందుల వాడకం మాని, ఆరుబయట వ్యాయామానికి అలవాటుపడి, ఎండాకాలంలోను చలికాలంలోను తమ ఇళ్లలో వాయు ప్రసారానికి అలవాటుపడి, స్వచ్ఛమైన నీళ్లు తాగి, స్వచ్ఛమైన నీటితో స్నానం చేస్తే, బాధాకర జీవితాలు వెళ్లదీసే బదులు సంపూర్ణారోగ్యం కలిగి ఆనందంగా నివసిస్తారు. CDTel 436.8