Go to full page →

జ్వరంగా ఉన్న సందర్భాల్లో CDTel 437

(1866) H. TO L., అధ్యా.3, పులు.62,63 CDTel 437.1

730. జ్వరంతో ఉన్న పరిస్థితుల్లో వారికి తాగటానికి ధారాళంగా నీళ్లు ఇస్తూ ఒంటికి వేడినీటి కాపడాలు పెడ్త్ దీర్ఘ రేయింబగళ్ల బాధ నివారణ అయ్యేది. అనేకమంది ప్రాణాలు దక్కేవి. కాని దహించివేస్తున్న దాహార్తిని తీర్చటానికి నీళ్లు లేక, దాన్ని పుట్టించే పదార్ధం కాలిపోయి, జీవపదార్ధం పూర్తిగా నాశనమయ్యేవరకు ఉదృతమౌతున్న జ్వరంతో వేల ప్రజలు మరణిస్తున్నారు. మండుతున్న భవనం మంటలు చల్లార్చటానికి ఉపయోగించే నీరు మానవ జీవ శక్తిని దహించివేసే దాహం మంటల్ని ఆర్పటానికి ఉపయోగించటం జరగటం లేదు. CDTel 437.2