Go to full page →

మనసుపైన, నైతికత పైన దాని ఫలితాలు CDTel 440

ఉత్తేజకాల వినియోగం ద్వారా వ్యవస్థ అంతా బాధకు లోనవుతుంది. నరాల సమతుల్యత ఉండదు. కాలేయం రోగగ్రస్తమై సరిగా పనిచెయ్యదు. రక్తం నాణ్యత, రక్త ప్రసార ప్రక్రియ దెబ్బతింటాయి. చర్మం చురుకుతనాన్ని కోల్పోయి పసుపురంగు ధరిస్తుంది. మనసుకు కూడా హాని కలుగుతుంది. ఈ ప్రేరేపకాల తక్షణ ప్రభావం వల్ల మెదడు అతిగా క్రియాత్మకమౌతుంది. వ్యక్తి శక్తిహీనుడై శ్రమపడలేని స్థితికి వస్తాడు. దాని అనంతర పర్యవసానం మానసిక, శారీరక, నైతిక శక్తి హీనత. ఫలితంగా ధైర్యం లేని వివేచన మానసిక సమతుల్యత లేని పురుషులు స్త్రీలని మనం చూస్తాం. తరచు వారు తొందర పాటుతనం, అసహనం, నిందారోపణ స్వభావం, ఇతరుల పొరపాట్లని భూత అద్దంలో చూసినట్లు చూడటం, తమ పొరపాట్లని పూర్తిగా విస్మరించటం ప్రదర్శిస్తారు. CDTel 440.2

టీ, కాఫీలు తాగేవారు సాంఘిక సమావేశాల్లో సమావేశమయినప్పుడు వారి హానికర అలవాటు ఫలితాలు ప్రదర్శితమవుతాయి. అందరూ తమకు ప్రియమైన ఆ పానీయాల్ని స్వేచ్చగా తాగుతారు. ఉత్సాహాన్ని కూర్చేదాని ప్రభావం కింద వారి నాలుకలు బరువౌతాయి. వారు ఇతరుల్ని గురించి చెడ్డ మాట్లాడటం మొదలు పెడతారు. ఆచితూచి మాట్లాడరు. తక్కువ కూడా మాట్లాడరు. వారి పనిలేని మాటలు, వ్యర్ధ ప్రసంగాలు ప్రసారమౌతాయి. తరచు విషపూరితమైన పుకార్లు గుప్పుమంటాయి కూడా. ఈ వ్యర్థ ప్రసంగికులు తమకు ఓ సాక్షి ఉన్నాడని మర్చిపోతారు. ఓ అదృశ్య పరిశీలకుడు వారి మాటల్ని పరలోక గ్రంధాల్లో రాస్తున్నాడు. టీ ఉద్రేకం ప్రభావం కింద చోటుచేసుకునే ఈ కఠిన విమర్శలు, ఈ అసత్య నివేదికల్ని తనకు వ్యతిరేకంగా చేసిన వాటిగా యేసు దాఖలు చేస్తాడు. “మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో, ఒకరికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరి” అంటాడు. CDTel 441.1

ఇప్పటికే మనం మన తండ్రులు తప్పుడు అలవాట్ల ఫలితంగా బాధలకు గురి అవుతున్నాం. అయినా ఎందరు వారికన్నా అన్ని విధాల అధ్యానమైన మార్గాన్ని అవలంబిస్తున్నాం? నల్లమందు, టీ, కాఫీ, పొగాకు సారా మానవజాతిలో ఇంకా మిగిలి ఉన్న జీవశక్తి నెరుసుని త్వరితంగా ఆర్పివేస్తున్నాయి. ప్రతీ ఏట మిలియన్ల గాలన్ల సారా తాగటం పొగాకు మీద మిలియన్ల రూపాయలు వ్యయం చేయటం జరుగుతున్నది. తిండి బానిసలు తమ ఆదాయాన్ని నిత్యం శరీరాశల తృప్తికి వ్యయం చేస్తూ తమ పిల్లలకి ఆహారం, బట్టలు విద్య లేకుండా చేస్తున్నారు. ఈ కీడులు కొనసాగుతుండగా సమాజం సరైన స్థితిలో ఉండజాలదు. CDTel 441.2