ఉత్తరం 69, 1896 CDTel 443.1
739. కొంత సేపు ఉత్సాహపర్చి తర్వాత వ్యవస్థని క్రితంకన్నా తక్కువ స్థాయికి దిగజార్చే ప్రతి స్పందననిచ్చేదేదీ ఆరోగ్యాన్ని ఏ విధంగాను వృద్ధిపర్చదు. టీ, కాఫీలు బలహీనంగా ఉన్న శక్తుల్ని కొంతసేపు ‘పైకి లేపుతాయి. కాని వాటి తక్షణ ప్రభావం పోయినప్పుడు నిరుత్సాహం చోటు చేసుకుంటుంది. ఈ పానీయాల్లో ఎలాంటి పోషణ లేదు. టీ, కాఫీల్లోని పాలు, పంచదార మాత్రమే వాటిలో ఉండే పోషణ. CDTel 443.2
ఆధ్యాత్మిక అవగాహన మొద్దుబార్చుతుంది CDTel 443.3
(1864) Sp. Gifts IV, 128, 129 CDTel 443.4
740. టీ, కాఫీలు ఉత్సాహం పుట్టించే పానీయాలు. వాటి ఫలితాలు పొగాకు ఫలితాలులాంటివి. కాని అవి చేసే హాని తక్కువ స్థాయిలో ఉంటుంది. నెమ్మదిగా పనిచేసే ఈ విషాల్ని ఉపయోగించేవారు, పొగాకు ఉపయోగించే వారిలా, అవి లేకుండా బతకలేమని భావిస్తారు. ఎందు చేతనంటే ఈ విగ్రహాలు లేనప్పుడు వారు చాలా బాధననుభవిస్తారు.... వక్రతిండి తినే వారు తమ ఆరోగ్యానికి, మానసిక శక్తులకి హాని చేసుకుంటున్నారు. వారు ఆధ్యాత్మిక విషయాల విలువను అభినందించరు. వారిలోని సానుభూతి వంటి సున్నితభావాలు మొద్దుబారాయి. పాపం పాపంగా కనిపించదు. సత్యాన్ని లౌకిక ఐశ్వర్యం కన్నా విలువైందిగా పరిగణించరు. CDTel 443.5
ఉత్తరం 44, 1896 CDTel 443.6
741. టీ, కాఫీలు తాగటం పాపం. అది హానికరమైన పానీయం. ఇతర దుష్కార్యాల్లా ఇది ఆత్మకు హాని కలిగిస్తుంది. ప్రియమైన ఈ విగ్రహాలు ఉత్సాహాన్ని పుట్టిస్తాయి. అది వ్యాధిగ్రస్తమైన నరాల చర్య. ఆ ప్రేరేపకాల తక్షణ ప్రభావం అంతమైన తర్వాత, అవి ఎంత ఎత్తుకి లేపుతాయో అంత కిందికి దిగజార్చుతాయి. CDTel 443.7
(1861) 11 222 CDTel 444.1
742. పొగాకు, టీ, కాఫీలు వాడేవారు ఆ విగ్రహాల్ని విడిచి పెట్టి వాటికయ్యే ఖర్చును ప్రభువు ధనాగారంలో జమ చెయ్యాలి. కొందరు దైవసేవ నిమిత్తం ఎలాంటి త్యాగం చెయ్యరు. దేవుడు తమను ఏమి చెయ్యాలని కోరుతున్నాడో దాని విషయంలో వారు మత్తులై నిద్రిస్తారు. పేదల్లో నిరు పేదలైన కొందరు ఈ ప్రేరకాల్ని త్యాగం చెయ్యటానికి తీవ్ర పోరాటం సాగించాల్సి ఉంటుంది. దేవుని సేవకు ద్రవ్యం లేనందుకు ఈ వ్యక్తిగత త్యాగం అవసరం అని కాదు. కాని ప్రతీ హృదయం శోధించబడుతుంది. ప్రతీ ప్రవర్తన వృద్ధిచెందుతుంది. దైవ ప్రజలు నియమబద్ధతతో పని చెయ్యాలి. ఆ నియమం జీవన విధానంలో ప్రస్పుటం కావాలి. CDTel 444.2
వాంఛలు దైవారాధనకి ఆటంకాలు CDTel 444.3
R.& H., జనవరి 25, 1881 CDTel 444.4
743. టీ, కాఫీలు, పొగాకు శరీర వ్యవస్థపై హానికరమైన ప్రభావం చూపుతాయి. టీ మత్తు కలిగిస్తుంది. పరిమాణంలో తక్కువైనప్పటికీ ఫలితం విషయంలోను స్వభావం విషయంలోను అది సారావంటిది. కాఫీ కి మేధని మసకబార్చి, శక్తుల్ని మొద్దుబార్చే స్వభావం ఉంది. అది పొగాకంత శక్తిమంతమైంది కాదు’ గాని ఫలితం విషయంలో రెండూ ఒకటే. పొగాకు వాడకానికి వ్యతిరేకంగా వాడే వాదనల్ని టీ, కాఫీల వినియోగానికి వ్యతిరేకంగా వాడవచ్చు. CDTel 444.5
టీ, కాఫీ, పొగాకు, నల్లమందు, సారా వాడకానికి అలవాటు పడ్డవారు అవి లేకుండా చేసిప్పుడు, దైవారాధనలో పాలు పొందలేరు. ఈ ప్రేరేపకాలు వాడకుండా వారు దైవారాధనలో పాలు పొందనివ్వండి; వారిని చైతన్య పర్చటానికి ఉద్వేగపర్చటానికి లేక వారి ప్రార్థనల్ని లేక సాక్ష్యాల్ని ఆధ్యాత్మికం చెయ్యటానికి దైవ కృపకు శక్తి ఉండదు. క్రైస్తవులుగా చెప్పుకునే వారు తమ సంతోషానందాల సాధనాలు ఎలాంటివో పరిగణించాలి. అవి పరలోక సంబంధమైనవో ఇహలోక సంబంధమైనవో పరిగణించాలి. CDTel 444.6