(1890) C.T.B.H.79,80 CDTel 444.7
744. తిండి వాంఛ పై అదుపు లేనప్పటికన్నా అదుపు ఉన్నప్పుడు మనసుల పై తనకు తక్కువ పట్టు ఉంటుందని సాతాను గ్రహిస్తాడు. కనుక అతడు మనుషుల్ని ఎల్లప్పుడూ తిండి ధ్యాసతో నింపుతాడు. అనారోగ్య దాయకమైన ఆహారం ప్రభావం కింద మనస్సాక్షి అచేతనమౌతుంది. మనసుని చీకటి కమ్ముతుంది. అభిప్రాయాల్ని గ్రహించేశక్తి దెబ్బతింటుంది. అయితే మనస్సాక్షి స్తబ్దమయ్యేంతవరకు అది అతిక్రమణకు లోనయిన కారణంగా అపరాధి నేరం తక్కువవ్వదు. CDTel 444.8
జీవశక్తుల్ని సహజ పరిస్థితిలో ఉంచటం పై మనసు తాలూకు ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది గనుక, ప్రేరేపకాలు, మత్తు పదార్థాలు వినియోగించకుండా ఉండటానికి ఎంత శ్రద్ధ వహించాలి! అయినా క్రైస్తవులమని చెప్పుకునేవారిలో చాలామంది పొగాకు వాడుతున్నారు. వారు అమితానుభవం తెచ్చే కీడుల్ని గర్షిస్తారు. సారావాడకాన్ని విమర్శిస్తూనే ఈ ప్రబుద్ధులు పొగాకు రసాన్ని నోటినుంచి కార్చుతూ ఉంటారు. ఈ కీడుకి మూలాన్ని చేరకముందు పొగాకు వాడకానికి సంబంధించిన అభిప్రాయంలో మార్పు అవసరం. ఈ అంశాన్ని కొంచెం లోతుగా ఆలోచిద్దాం. టీ, కాఫీలు బలమైన ప్రేరేపకాలకు వాంఛ పుట్టిస్తాయి. తర్వాత ఇంటికి మరింత దగ్గరకు వద్దాం. ఆహారం తయారు చెయ్యటానికి వద్దాం. అన్ని విషయాల్లోను మితానుభవం ఆచరిస్తున్నామా? ఆరోగ్యానికి ఆనందానికి అవసరమైన దిద్దుబాట్లు ఇక్కడ జరుగుతున్నవా? అని ప్రశ్నిద్దాం. CDTel 445.1
నిజమైన ప్రతీ క్రైస్తవుడు తన తిండి వాంఛని ఉద్రేకాల్ని అదుపులో ఉంచుకుంటాడు. తిండి బానిసత్వం నుంచి విడుదల పొందితే తప్ప అతడు క్రీస్తుకి నిజమైన విధేయుడైన సేవకుడు కాలేడు. మితం లేని తిండి, ఆవేశం, హృదయం పై సత్యం చూపే ప్రభావాన్ని వ్యర్థం చేస్తాయి. CDTel 445.2