Go to full page →

తిండితో పోరాటంలో ఓటమి దిశలో CDTel 445

(1875) 3T 487,488 CDTel 445.3

745. అనారోగ్యకరమైన ఆహారం తీసుకోటంతో మన భోజనబల్లలవద్ద నిగ్రహంలేని ఆశ ప్రారంభమౌతుంది. కొంతకాలం తర్వాత ఎడతెరపి లేకుండా తినటం ద్వారా జీర్ణమండల అవయవాలు బలహీనమౌతాయి. తీసుకుంటున్న ఆహారం ఆకలిని తీర్చలేకపోతుంది. అనారోగ్యకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. మరింత ఉద్రేకం పుట్టించే ఆహారం కోసం తృష్ణ పుడుతుంది. టీ, కాఫీ, మాంస పదార్ధాలు తక్షణ ఫలితాన్నిస్తాయి. ఈ విషాల ప్రభావం కింద నాడీవ్యవస్థ ఉద్రేకాలకి లోనవుతుంది. కొన్ని సందర్భాల్లో తాత్కాలికంగా మేధ బలాన్ని పొందినట్లు, ఆలోచన స్పష్టంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ ప్రేరేపకాలు తాత్కాలికంగా అలాంటి మంచి ఫలితాలు ఉత్పత్తి చేస్తున్నాయి. కాబట్టి అనేకమంది అవి తమకు అవసరమని భావించి వాటి వినియోగం కొనసాగిస్తారు. కాని దానికి ఎప్పుడూ ప్రతిస్పందన ఉంటుంది. ఎక్కువగా ఉద్రేకానికి గురి అయిన నాడీవ్యవస్థ, తన భవిష్యత్తు శక్తి వనరుల నుంచి ప్రస్తుత అవసరాలికి శక్తిని అప్పు తీసుకుంటుంది. వ్యవస్థ తాత్కాలికంగా పొందిన శక్తి అనంతరం మాంద్యం ఏర్పడుతుంది. ఈ ప్రేరేపకాలు వ్యవస్థకి తాత్కాలికంగా ఇచ్చే శక్తి వల్ల ఉద్రేకం పొందిన అవయవాలు ఆ ప్రేరేపకాల ప్రభావం పోయిన తర్వాత తాము పొందిన శక్తి నిష్పత్తిలో హీనమైపోతాయి. మరింత బలమైన దాన్ని వాంఛించటానికి తిండి వాంఛ తర్బీతవుతుంది. దాన్ని తృప్తిపర్చటం ఓ అలవాటుగా మారి పొగాకు, మద్యం, సారా వంటి బలమైన ప్రేరేపకాలకి నిత్యం తృష్ణ పుట్టే వరకు అది ఉద్రేకాన్ని కొనసాగించి వృద్ధిపర్చుతుంది. తిండి వాంఛని ఎంత ఎక్కువ తృప్తిపర్చితే దాని కోర్కెలు అంత ఎక్కువవ్వుతాయి, వాటి నియంత్రణ అంత కష్టమౌతుంది. శరీర వ్యవస్థ ఎంత ఎక్కువ దుర్బలమైతే, అస్వాభావిక ప్రేరేపకాల్ని విడిచి పెట్టటం అంత కష్టమై, ఈ ప్రేరేపకాల కోసం ఉద్రేకం అంత ఎక్కువై చివరికి మనశ్శక్తి నిర్వీర్యమౌతుంది. అప్పుడు వీటి తృప్తిని కోరే అస్వాభావికమైన ఈ వాంఛను ఉ పేక్షించగల శక్తి ఉండదు. CDTel 445.4