Go to full page →

సత్యం, స్వీయ వాంఛ మధ్య సంఘర్షణ CDTel 447

(1864) Sp. Gifts IV, 36,37 CDTel 447.1

746. మేమే అహరోనులకు యెహోవాకు ఎదురుతిరిగిన కోరహు అతడి అనుచరులకు సంబంధించిన విషయాలు దైవ ప్రజలకి ముఖ్యంగా అంత్యకాలానికి సమీపంలో భూమిపై నివసిస్తున్నవారికి హెచ్చరికగా ఉండటానికి దాఖలు చెయ్యటం జరిగింది. దైవ ప్రజల మధ్య తిరుగుబాటు లేపటానికి కోరహు, దాతాను, అబిరాము మాదిరిని అనుకరించటానికి సాతాను మనుషుల్ని నడిపిస్తున్నాడు. స్పష్టమైన సాక్ష్యాలకి ఎదురుతిరిగి, ఆత్మవంచితులై, దేవుడు తన సేవా భారాన్ని ఎవరి పై మోపుతాడో వారు తమను తాము దైవ ప్రజల పై హెచ్చించుకుంటున్నారని, వారి సలహాలు, గద్దింపులు అనవసరం అసంబద్దం అని నిజంగా భావిస్తారు. దైవ ప్రజల తప్పిదాల్ని మందలించాల్సిందిగా తమని కోరుతూ దేవుడిచ్చిన స్పష్టమైన సాక్ష్యాల్ని వ్యతిరేకిస్తూ వారు తిరుగుబాటు చేస్తారు. టీ, కాఫీ, నశ్యం, పొగాకు వంటి హానికరమైన వాటి వినియోగానికి వ్యతిరేకంగా సమర్పితమైన సాక్ష్యాలు ఓ తరగతి ప్రజలకి ఆగ్రహం పుట్టిస్తున్నాయి. ఎందుకంటే అవి వారి విగ్రహాల్ని నాశనం చేస్తాయి. హానికరమైన ఈ పదార్థాల్ని పూర్తిగా విడిచి పెట్టాలా లేక స్పష్టంగా సమర్పితమైన సాక్ష్యాల్ని తోసిపుచ్చి, తిండి వాంఛకు లొంగాలా అన్న విషయంపై అనేకులు నిర్ణయించుకోలేదు. వారు అనిశ్చయమైన స్థానాన్ని ఆక్రమించారు. వారి విశ్వాసానికి వారి స్వీయ వాంఛకు మధ్య సంఘర్షణ సాగింది. తమ సందిగ్ధ పరిస్థితి వారిని బలహీనులుగా చేసింది. అనేకుల విషయంలో తిండి ప్రీతే జయించింది. నెమ్మదిగా పనిచేసే ఈ విషాల వినియోగం వల్ల పరిశుద్ధ విషయాల స్పృహ వక్రీకృతమైంది. పర్యవసానాలు ఏమైనప్పటికీ, స్వీయ వాంఛలు వదులకోమని చివరికి వారు మనఃపూర్వకంగా నిశ్చయించుకున్నారు. దేవుడు ఆజ్ఞాపించినట్లు శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుంచి తమను తాము పవిత్ర పరచుకుని. ప్రభువు భయంలో పరిశుద్ధతను సంపూర్ణం చేసుకుంటున్న వారికి వీరికి మధ్య ఆ భయంకర తీర్మానం ఓ వేర్పాటు గోడును లేపింది. నిష్కర్ష అయిన సాక్ష్యాలు వారి మార్గంంలో నిలిచి అసౌకర్యం కలిగించాయి. వాటికి వ్యతిరేకంగా పోరాడటంలోను తాము నిజమైన అనుచరులం కామని తమని తాము ఇతరులను నమ్మించేటట్లు చెయ్యడంలోను ఉపశమనం కనిపెట్టారు. ప్రజలు మంచివారే అని మందలింపు సాక్ష్యాలే సమస్య సృష్టిస్తున్నాయని అన్నారు. తిరుగుబాటు దారులు తమ జండాని ఎగురవేసినపుడు అసంతృప్తి చెందిన వారందరూ ఆ జండా కింద సంఘటితమయ్యారు. ఆధ్యాత్మికంగా లోపాలున్నవారు కుంటివారు అంగహీనులు గుడ్డివారు చెదరగొట్టటానికి అసమ్మతి విత్తటానికి చేతులు కలిపి తమ ప్రభావాన్ని సంయుక్తం చేశారు. CDTel 447.2