Go to full page →

అమితత్వ వేరులు CDTel 448

(1905) M.H. 335 CDTel 448.1

747. అమితత్వాన్ని దిద్దుబాటు చేయడానికి తీవ్ర కృషి జరుగుతున్నది. కాని అసలు విషయం పై కేంద్రీకృత కృషి ఎక్కువ జరగటంలేదు. అనారోగ్యకరమైన ఆహారం, మసాలాలు, టీ, కాఫీల వాడకం వల్ల సంభవించే కీడుల పై మితానుభవ సంస్కరణ ప్రబోధకులు దృష్టి పెట్టాలి. మితానుభవ కార్యకర్తలందరికీ దేవుడు జయం అనుగ్రహించాలని మేము కోరు కుంటున్నాం. కాని తాము పోరాడుతున్న దుష్టతకి కారణాన్ని లోతుగా పరిశీలించాలని, సంస్కరణ చేయడంలో స్థిరంగా నిలకడగా ఉండాలని వారిని కోరుతున్నాం. CDTel 448.2

మానసికమైన నైతికమైన శక్తుల సరియైన సమతుల్యం శరీర వ్యవస్థ సరియైన పరిస్థితి మీద చాలావరకు ఆధారపడి ఉంటుందని ప్రజల దృష్టికి తేవడం జరగాలి. భౌతిక స్వభావాన్ని బలహీనపర్చి భ్రష్టం చేసే సమస్త మత్తు పదార్థాలు, అస్వాభావిక ప్రేరేపకాలు మేధని నైతిక శక్తుల్ని దెబ్బతీయడానికి తోడ్పడతాయి. మితరాహిత్యం లోకంలోని నైతిక (భ్రష్టతకు పునాది వేస్తుంది. వక్ర తిండికి బానిస కావడంవల్ల మానవుడు శోధనను ప్రతిఘటించే శక్తిని కోల్పోతాడు. CDTel 448.3

ఈ అంశాలపై ప్రజల్ని చైతన్య పరచడంలో మితానుభవ సంస్కర్తలు చెయ్యాల్సిన సేవ ఉన్నది. అలసిపోయిన శారీరక శక్తుల్ని ఉత్సాహ పరచి అస్వాభావికమైన, క్షణికమైన చర్యకు ప్రోత్సహించే ప్రేరేపకాల్ని వాడటం వల్ల, ఆరోగ్యం, ప్రవర్తన, ప్రాణం సహితం ప్రమాదంలో పడతాయని ప్రజలకి బోధించండి. CDTel 448.4