Go to full page →

శిబిర సమావేశ స్థలంలో వైద్య గుడారం CDTel 461

(1900) 6T 112,113 CDTel 461.3

764. లోకాంతాన్ని సమీపించే కొద్దీ మనం ఆరోగ్య సంస్కరణని, క్రైస్తవ మితానుభవాన్ని నిశ్చింతగా నిర్ణయాత్మకంగా సమర్పించటంలో ఇంకా ఉన్నత స్థాయికి చేరాలి. మాటల ద్వారానే కాదు మన పనుల ద్వారా కూడా మనం ప్రజల్ని నిత్యం చైతన్య పర్చాలి. ఉచ్చరణ ఆచరణ సంయుక్త మైనప్పుడు వాటి ప్రభావం శక్తిమంతమౌతుంది. CDTel 461.4

శిబిర సమీవేశాల్లో ఆరోగ్యాంశాలపై ప్రజలకు ఉపదేశం ఇవ్వాలి. ఆస్ట్రేలియాలోని మన సమావేశాల్లో ప్రతీరోజు ఆరోగ్యాంశాల పై ఉపన్యాసాలివ్వటం జరిగింది. ప్రజల హృదయాల్లో గొప్ప ఆసక్తి రేకెత్తింది. సమావేశాలు జరుగుతున్న ఆవరణలో డాక్టర్లు, నర్సులకు ఓ డేరా ఏర్పాటు చేశారు. అక్కడ డాక్టర్లు ఉచితంగా వైద్యసలహాలు ఇవ్వటం అనేకులు ఆ తరుణాన్ని వినియోగించుకోటం జరిగేది. వేలమంది ఆరోగ్య ఉపన్యాసాలికి హాజరయ్యారు. శిబిర సమావేశాలు ముగిసాక ప్రజలు తాము నేర్చుకున్న విషయాలతో తృప్తి చెందలేదు. దాన్ని అక్కడితో విడిచి పెట్టలేదు. శిబిర సమావేశాలు జరిగిన నగరాలు అనేకమైనవాటిలో సేనిటేరియం శాఖ స్థాపించమని దానికి తమ సహకారం అందిస్తామని కొందరు ప్రముఖ పౌరులు విజ్ఞప్తి చేశారు. CDTel 461.5