Go to full page →

బోధన ఆదర్శాల ద్వారా CDTel 462

(1900) 6T 112 CDTel 462.1

765. ఆరోగ్య సంస్కరణ నియమాల్ని ఉదాహరించటానికి మన ప్రజలకి మనం నిర్వహించే బృహత్ సమావేశాలు చక్కని అవకాశాన్ని సమకూర్చుతాయి. ఆరోగ్యసంస్కరణను గురించి, ఈ సమావేశాల్లో చాల చెప్పటం జరిగింది. కాని అదే సమయంలో భోజనబల్లలమీద మాంసం వంటకాలు సరఫరా చెయ్యటం, సరకుల దుకాణాల్లో అనారోగ్యకరమైన వంట సరకులు విక్రయించటం జరిగింది. క్రియలు లేని విశ్వాసం మృత విశ్వాసం. ఆచరణలేని ఆరోగ్యసంస్కరణ పై ఉపదేశం మనసుల్ని ప్రభావితం చెయ్యలేకపోయింది. తదనంతర శిబిర సమావేశాల్లోని అధికారులు ఉపదేశం ద్వారాను ఆచరణద్వారాను ప్రజల్ని చైతన్య పర్చారు. శిబిర భోజనశాలలో మాంసం వడ్డించలేదు. పండ్లు, గింజలు, కూరగాయలు సమృద్ధిగా సరఫరా చెయ్యటం జరిగింది. మాంసం ఆరోగ్యకరం కాదన్న జవాబు స్పష్టంగా ఇవ్వటం జరిగింది. CDTel 462.2

[శిబిర సమావేశ స్థలంలో క్యాండీలు, ఐస్ క్రీమ్, తదితర చిన్న చిన్న వస్తువుల విక్రయం -529,530] CDTel 462.3