Go to full page →

రోగులకు గృహ వైద్యం నేర్పించండి CDTel 463

ఉత్తరం 204, 1906 CDTel 463.2

768. సాధ్యమైనంత మేరకు రోగుల్ని ఆరుబయట ఉంచండి. సంతోషాన్ని కూర్చే ఉపన్యాసాలు వాటితోపాటు సామాన్య వేదపఠనం సులభంగా గ్రాహ్యమయ్యే బైబిలు పాఠాలు హాలులో నిర్వహిస్తే ఆత్మకు ఎంతో ప్రోత్సాహం కలుగుతుంది. సోదరుడా, ఆరోగ్య సంస్కరణ పై మాట్లాడు. కాని ఆరోగ్య సంస్కరణ సామాన్య పాఠాలు నీవు బోధించలేని అనేక ఇతర అంశాల భారాన్ని భుజాన వేసుకోవద్దు. సేనిటేరియం నుంచి తమ ఇళ్లకు తిరిగి వెళ్లేవారు చక్కగా ఉపదేశం పొంది వెళ్లాలి. తమ కుటుంబాలకి వైద్యం చేసుకోటానికి పద్దతులు ఇతరులుకి నేర్పగల జ్ఞానంతో వారు తిరిగి వెళ్లాలి. CDTel 463.3

రోగులు తమ గృహ చికిత్సలో ఉపయోగించలేని యంత్రాలు పరికరాల పై విపరీతంగా వ్యయం చేసే ప్రమాదముంది. వాటికి బదులు శరీర యంత్రాంగం సామరస్యంగా పనిచేసేందుకు, ఆహారం క్రమంగా తీసుకోటం నేర్పించండి. CDTel 464.1