Go to full page →

మితానుభవంపై ఉపదేశం ఇవ్వాలి. CDTel 464

ఉత్తరం 145, 1904 CDTel 464.2

769. మన వైద్య సంస్థల్లో మితానుభవాన్ని గూర్చి స్పష్టమైన ఉపదేశం ఇవ్వాలి. మత్తులోకి దింపే సారా తెచ్చి పెట్టే ప్రమాదాన్ని ఎత్తి చూపుతూ సంపూర్ణ నిరాకరణ ద్వారా కలిగే మేళ్లు ఉపకారాల్ని రోగులకి వివరించాలి. తమ ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్న వాటిని విడిచి పెట్టి వాటిస్థానే పండ్లు పుష్కలంగా తీసుకోవాలని వారికి ఉపదేశించాలి. నారింజ పండ్లు, నిమ్మకాయలు, ప్రూన్లు, పీయేు ఇంకా అనేక ఇతర రకాల పండ్లు కొనుక్కుని తినవచ్చు. ఎందుకంటే దేవుని ప్రపంచం ఉత్పత్తులతో నిండిన ప్రపంచం. శ్రమించి పనిచేస్తే వాటిని ఉత్పత్తి చేసుకోవచ్చు. CDTel 464.3

(1905) M.H.176,177 CDTel 464.4

770. తిండి వాంఛతో పోరాడుతున్న వారికి ఆరోగ్యజీవన నియమాలపై ఉపదేశం ఇవ్వాలి. రోగగ్రస్త పరిస్థితులు, అస్వాభావిక వాంఛల సృష్టిద్వారా జరిగే ఆరోగ్య చట్టాల ఉల్లంఘన సారా అలవాటుకి పునాది వేస్తుందని వారికి బోధించాలి. ఆరోగ్యనియమాలకు విధేయులై నివసించటం ద్వారా మాత్రమే తాము అస్వాభావిక ప్రేరేపకాల పట్ల వాంఛలనుంచి స్వేచ్చ పొందగలరని వారికి బోధించాలి. తిండి వాంఛ సంకెళ్లను విరగగొట్టటానికి దేవుని మీద ఆధారపడి, ఆయన నైతిక, భౌతిక చట్టాల్ని ఆచరిస్తూ వారు దేవునితో సహకరించాలి. CDTel 464.5