Go to full page →

ఆరోగ్య సంస్కరణాచరణ వైఫల్యం సువార్త సేవకు అనర్హత CDTel 474

సువార్త సేవ చేసే సహోదరుల్లో కొందరు ఆరోగ్య సంస్కరణలో ఏమంత ఆసక్తి ఎందుకు ప్రదర్శించటం లేదు? ఎందుకంటే అన్ని విషయాల్లో మితానుభవాన్ని గూర్చిన ఉపదేశం మిత రహిత ఆహార పానాల్ని వ్యతిరేకిస్తుంది. కొన్ని స్థలాల్లో ప్రజలు ఆరోగ్య సంస్కరణను పరిశీలించటానికి, దాని ఆచరణ బోధించటానికి వారిని రప్పించటంలో మనకు అతి పెద్ద ఆటంక బండ అవుతున్నది. ఆహార విషయంలో దేవుడు తనకిచ్చిన ఉపదేశాన్ని ఏ సేవకుడి బోధన లేదా ఆదర్శం ఖండిస్తుందో అతడ్ని ప్రజలకు బోధకుడుగా నియమించకూడదు. ఎందుకంటే అది గందరగోళం సృష్టిస్తుంది. ఆరోగ్య సంస్కరణపట్ల అతడి ఉదాసీనత అతణ్ని ప్రభువు దూతగా అనర్హుణ్ని చేస్తుంది. CDTel 474.1

ఈ అంశంపై తన వాక్యంలో ప్రభువిచ్చిన వెలుగు స్పష్టంగా ఉంది. మనుషులు దాన్ని అనుసరిస్తారో లేదో పరీక్షించి తెలుసుకోటానికి అనేక మార్గాలున్నాయి. క్రైస్తవ మితానుభవం గురించి ప్రతీ సంఘం, ప్రతీ కుటుంబం ఉపదేశం ఇవ్వాలి. ఆరోగ్యం కాపాడుకోటానికి ఆహార పానాలు ఎలా తీసుకోవాలో అందరూ తెలుసుకోవాలి. మనం ఈ లోక చరిత్ర చివరి దృశ్యాలు చోటుచేసుకుంటున్న సమయంలో ఉన్నాము. సబ్బాతు ఆచరించేవారి నడుమ సామరస్యపూర్వక చర్య అవసరం. ఈ అంశంపై ఉపదేశించే గొప్ప సేవలో పాల్గొనకుండా దూరంగా నిలబడి ఉండేవారు ఆ మహావైద్యుడు నడిచి వెళ్తున్న మార్గాన ఆయన్ని వెంబడించటం లేదు. “ఎవరైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్ను తాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను.” అని క్రీస్తు అంటున్నాడు. మత్తయి 16:24. CDTel 474.2