Go to full page →

గృహంలో ఆరోగ్య విద్య CDTel 474

(1905) M. H.386 CDTel 474.3

783. తల్లిదండ్రులు తమ బిడ్డలకోసం ఎక్కువ, సమాజం కోసం తక్కువ నివసించాలి. ఆరోగ్యాంశాల్ని అధ్యయనం చేసి మీ జ్ఞానాన్ని ఆచరణాత్మకంగా ఉపయోగించండి. కార్యకారణ సూత్రబద్ధంగా ఆలోచించటం మీ బిడ్డలకి నేర్పించండి. ఆరోగ్యం సంతోషం కావాలంటే ప్రకృతి చట్టాలకు విధేయులై నివసించాలని వారికి నేర్పించండి. మీరు ఆశించినంత వేగంగా అభివృద్ధి కనిపించకపోయినా నిరుత్సాహపడక దీక్షతో పట్టుదలతో మీ పనిని కొనసాగించండి. CDTel 474.4

ఊయలలో ఉన్న దశనుంచి ఆత్మత్యాగం సంయమనం మీ బిడ్డలకు నేర్పించండి. ప్రకృతి సౌందర్యాన్ని ఆనందించటం, ఆచరణాత్మక పనిలో శారీరక మానసిక శక్తుల్ని క్రమబద్ధంగా ఉపయోగించటం వారికి నేర్పించండి. ఉల్లాస ప్రవృత్తి, సౌమ్య స్వభావం కలిగి ఉండటానికి ఆరోగ్యవంతమైన దేహతత్వం, నైతికత సాధించేటట్లు వారిని పెంచండి. కేవలం ప్రస్తుతానందం కోసమే కాక అంతిమ మేలు కోసం మనం నివసించాలన్నది దేవుని సంకల్పమన్న సత్యాన్ని వారి లేత మనసులపై ముద్రించండి. శోధనకు లొంగటం బలహీనతని, దుర్మారతని, ప్రతిఘటించటం ఘనమని, వీరోచితమని వారికి నేర్పించండి. ఈ పాఠాలు సారవంతమైన నేలలో నాటిన విత్తనాలవుతాయి. వారు మీ హృదయాల్ని ఆనందింపజేసే ఫలాలు ఫలిస్తారు. CDTel 475.1