Go to full page →

మాంసాహార సమస్యను జాగ్రత్తగా పరిష్కరించాలి CDTel 484

ఉత్తరం 102, 1896 CDTel 484.1

795. ఈ దేశం (ఆస్ట్రేలియా) లో వ్యవస్థీకృతమైన ఓ శాఖాహార సమాజం ఉంది గాని దాని సభ్యుల సంఖ్య తులనాత్మకంగా చిన్నది. సామాన్యంగా అన్ని తరగతుల ప్రజలు మాంసాన్ని ఎక్కువ ఉపయోగిస్తారు. అదే చౌకగా దొరికే ఆహారం. పేదరికం ప్రబలంగా ఉన్న కుటుంబాల్లో సహితం భోజన బల్లలపై మాంసం దర్శనమిస్తుంది. కనుక మాంసాహార సమస్య విషయంలో ఆచితూచి అడుగులు వెయ్యాలి. ఈ విషయంలో దుందుడుకుగా వ్యవహరించటం పనికి రాదు. మనం ప్రజల పరిస్థితిని, జీవితకాలమంతా కొనసాగుతున్న అలవాట్లు అభ్యాసాల్ని పరిగణలోకి తీసుకుని, ఇది ఓ పరీక్ష అన్నట్లు, మాంసం తినేవారు నికృష్ట పాపులన్నట్లు మన అభిప్రాయాల్ని ఇతరుల పై రుద్దటానికి ప్రయత్నించకూడదు. CDTel 484.2

ఈ అంశంపై అందరికి వెలుగు అందాలి. కాని దాన్ని జాగ్రత్తగా సమర్పించాలి. జీవితకాలమంతా మంచివిగా భావించబడ్డ అలవాట్లను తొందరపడి హఠాత్తుగా మార్చకూడదు. మన శిబిర సమావేశాలు ఇతర పెద్ద పెద్ద సమావేశల్లో మనం ప్రజలకు ఉపదేశమివ్వాలి. ఆరోగ్య సంస్కరణ సూత్రాల్ని బోధించాల్సి ఉండగా ఆ బోధనకు ఆచరణకు మద్దతు ఉండాలి. మన హోటళ్లలోనే గాని మన భోజనశాలల్లోనే గాని మాంసం కనిపించకూడదు. దాని స్థానాన్ని పండ్లు, గింజలు, కూరగాయలతో భర్తీ. చెయ్యాలి. మనం బోధించే దాన్ని ఆచరణలో పెట్టాలి. మాంసం వడ్డించిన భోజనబల్ల వద్ద కూర్చున్నప్పుడు దాన్ని తినేవారి పై దాడి చెయ్యకూడదు. మనం మాత్రం దాన్ని ముట్టకూడదు. ఎందుకు తినటం లేదని ఎవరైన ప్రశ్నించినప్పుడు మనం ఎందుకు తినమో మర్యాదగా విశదీకరించాలి. CDTel 484.3